పూర్వకాలంలో మన పెద్దలు విపరీతంగా శ్రమించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా అయింది. ప్రస్తుతం శ్రమకు అర్థం మారిపోతుంది. రోజు రోజుకు కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. శ్రమ పడేవారి సంఖ్య తగ్గిపోతుంది. ఇక ఏసీలు హాయిగా కూర్చొని పని చేయవచ్చు ఏముందిలే అని చాలా మంది అంటుంటారు. కంప్యూటర్ల ముందు గంటల కొద్ది కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వీటిలో ఒకటి వేళ్ల నొప్పులు. గంటల తరబడి టైపింగ్ చేసే వాళ్లకి వేల్లు నొప్పులు వస్తుంటాయి. ఈ సమస్యకి చెక్ పెట్టడానికి కొన్ని సింపుల్ ఎక్సర్ సైజ్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంతకి ఆ వ్యాయామాలు ఏంటంటే..?
Advertisement
Advertisement
- ఎక్కువ సేపు టైపింగ్ చేసే వారికి సాప్ట్ బాల్‌ని నొక్కడం ద్వారా రిలీఫ్ ఉంటుంది. బాల్‌ని పది సెకన్ల పాటు నొక్కి అదేవిధంగా ఉంచాలి. కనీసం 10 నుంచి 13 సార్లు ఇలా చేస్తే వేళ్ల నొప్పులు తగ్గుతాయి.
- సహజంగా కంప్యూటర్ల ముందు కూర్చొనే వారు అదే పనిగా వర్క్ చేస్తుంటారు. అలా కాకుండా వారు గంటలో ఒకసారి బ్రేక్ ఇస్తుండాలి. ఇలా బ్రేక్ ఇవ్వడం వల్ల చేతి పిడికిలిని తెరిచి వేళ్లను వీలైనంత వరకు సాగదీయాలి. మళ్లీ పిడికిలి మూయాలి. ఇలా రిపీట్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- అప్పుడప్పుడు చేతులను ముందుకు చాచి మణికట్టును చుట్టూ తిప్పాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంటి క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో పిడికిలి బిగించి మణికట్టును తిప్పాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
- రెండు చేతుల వేళ్లను ఒకదాంట్లో ఒకటి పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా 4 నుంచి 5 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేళ్ల నొప్పులు తగ్గుతుంది.
- చేతి వేళ్లను అప్పుడప్పుడు కదిలించాలి. ఒకే శైలిలో గంటల తరబడి టైపింగ్ చేస్తే వేళ్లలో నరాలు పట్టుకున్నట్టే నొప్పి వస్తుంది. కొంచెం గ్యాప్ ఇస్తూ చేతి వేళ్లను ఆడిస్తుండాలి.
Also Read : పొన్నియిన్ సెల్వన్ లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ?