Home » హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

అక్కినేని నాగార్జున తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 99 చిత్రాల్లో న‌టించారు. అందులో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మ‌రికొన్ని సినిమాలు ప్లాఫ్ అయ్యాయి. ముఖ్యంగా నాగ‌ర్జున న‌టించిన సినిమాల్లో బెస్ట్ అనిపించుకునే సినిమాలు చాలా త‌క్కువే ఉన్నాయి. అలాంటి వాటిలో హ‌లో బ్ర‌ద‌ర్ మూవీ ఒక‌టి అనే చెప్ప‌వ‌చ్చు. ఈ చిత్రంలో నాగార్జున డ‌బుల్ యాక్ష‌న్‌తో అద్భుతంగా ఆక‌ట్టుకున్నారు. ఏప్రిల్ 20,1994లో ఈ చిత్రం విడుద‌లైంది. దీనిని రూ.2.50 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించారు.

Advertisement

నాగార్జున సినీ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచిన సినిమాల్లో హ‌లో బ్ర‌ద‌ర్ కూడా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లితెర పై ఇప్ప‌టికీ ప్రేకుల‌ను అల‌రిస్తూనే ఉంది. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో నాగార్జున దేవా, ర‌వివ‌ర్మ పాత్ర‌ల్లో డ‌బుల్ రోల్ చేసి అల‌రించారు. ముఖ్యంగా సుర్రు స‌మ్మైపోద్ది.. అనే మాస్ డైలాగ్ ఇప్ప‌టికీ అంద‌రి నోట్లో నానుతూనే ఉంది. కోట‌శ్రీ‌నివాస‌రావు, మ‌ల్లికార్జున‌రావు, బ్ర‌హ్మానందం, అలీ కామెడీ, హీరోయిన్లు ర‌మ్య‌కృష్ణ‌, సౌంద‌ర్య‌ల గ్లామ‌ర్ కోటి సంగీతం సినిమాకే ప్ల‌స్ పాయింట్స్ అని చెప్ప‌వ‌చ్చు.

Advertisement

Also Read :  సమంత విడాకుల విషయం తెలిసి ఎగిరి గంతేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?


ఇదిలా ఉండ‌గా ఈ చిత్రంలో నాగార్జున డ‌బుల్ రోల్‌కి ఓ టాలీవుడ్ మ‌రో సాయం చేశాడ‌ట‌. అన‌గా రెండో నాగార్జున‌కు డూప్‌గా అన్న మాట‌. ఆ హీరో మ‌రెవ్వ‌రో కాదు. ఫ్యామిలీ హీరో శ్రీ‌కాంత్ హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాలో బాత్ ట‌బ్ సీన్ ఒక‌టి ఉంటుంది. ఆ సీన్‌లో నాగార్జున డూప్‌గా చేసింది మ‌న శ్రీ‌కాంత్ అట‌. వీరిద్ద‌రూ సేమ్ హైట్ ఉండడం వ‌ల్ల అది బాగా సెట్ అయింద‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్‌లో ఈ సినిమా 120 షోలు హౌస్‌పుల్‌గా ఆడి రికార్డుల మోత మోగించింది. దాదాపు నెల రోజుల పాటు హౌస్‌ఫుల్ గా ర‌న్ అయింది. 30 కేంద్రాల్లో 50 రోజులు, 20 కేంద్రాల్లో 100 రోజులు న‌డిచి రికార్డు సృష్టించింది. మొత్తానికి రూ.15.25 కోట్ల గ్రాస్‌ను సాధించింది. రూ.8.0 కోట్ల‌ను వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. నాగార్జున కెరీర్‌లోనే ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్ప‌వ‌చ్చు.

Also Read :  క్యూట్ స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి.. ఒక్క మూవీతోనే కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది..!!

Visitors Are Also Reading