Home » క్యూట్ స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి.. ఒక్క మూవీతోనే కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది..!!

క్యూట్ స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి.. ఒక్క మూవీతోనే కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ క్యూట్ స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి తెలుగు ఇండస్ట్రీ లో ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయి వరుస అవకాశాలను అందుకుంటోంది. ఈ తరుణంలోనే తన పారితోషికం కూడా అమాంతంగా పెంచేసింది.. ఈ మూవీ ద్వారా కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు మనందరికీ తెలిసిన ఆ స్టార్ హీరోయిన్.. కానీ ఇప్పటికీ గుర్తుకు రావడం లేదు.. మీకోసం చిన్న క్లూ ఈ కథానాయిక మన తెలుగు హీరోయిన్ కాదు.. కానీ తెలుగులో ఈ ఒక్క సినిమా ద్వారానే అమాంతం స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది.. ఈ క్రేజీ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందింది.. బాలీవుడ్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి సూపర్ హిట్ హీరోయిన్ గా మారిపోయింది.. ఇంకా గుర్తుకు రాలేదా..

also read:పెళ్లి వేడుక‌లో వ‌ధువు చేసిన ప‌నికి ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!

Advertisement

Advertisement

సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలిచిన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ఈ ఒక్క సినిమా ద్వారానే ఆమె తల్లి ఇండస్ట్రీలో ఎనలేని ఎత్తుకు ఎదిగింది.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.. అయితే ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా బుల్లితెర సీరియల్ కుంకుమ భాగ్యలో నటించింది.. దీని తర్వాత బీటౌన్ చిత్రాల్లో నటించి, లవ్ సోనియా, సూరియా, సూపర్ 30, జెర్సీ, తుఫాన్ వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది..

ఈ తరుణంలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం మూవీలో సీతామాలక్ష్మి పాత్రలో ఈమె నటనతో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ ఒక్క సినిమా చేసిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మృణాల్ ఠాకూర్ రాబోతోందని సమాచారం. అయితే ఈ బ్యూటీకి సంబంధించిన ఒక చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి క్యాప్షన్ పెట్టి వైరల్ చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading