Home » యాంక‌ర్ ర‌ష్మీ గురించి మెగా అల్లుడు షాకింగ్ కామెంట్స్‌.. ఎందుకో తెలుసా..?

యాంక‌ర్ ర‌ష్మీ గురించి మెగా అల్లుడు షాకింగ్ కామెంట్స్‌.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మెగా కుటుంబానికి క్రేజ్ ఎంత ఉంటుందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగులోకి పెట్టి స్వ‌య‌కృషితో అంచలంచెలుగా ఎదిగి నేడు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇక ఆయ‌న అండ‌తో ఎంతో మంది హీరోలు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా మెగా అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఒక‌రు.


ముఖ్యంగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉప్పెన సినిమా ద్వారా వైష్ణ‌వ్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకి వచ్చి తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఉప్పెన మంచి హిట్ కావ‌డంతో ఈయ‌న‌కు అనంత‌రం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. కొండ పొలం న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేయ‌లేకపోయింది. ఈ సినిమా అనంత‌రం ముచ్చ‌ట‌గా మూడోసారి ఈయ‌న గిరీష‌య్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన రంగ రంగ వైభ‌వంగా అనే సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ చిత్ం కూడా పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేద‌నే తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  రేణూ దేశాయ్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…?

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వైష్ణ‌వ్ తేజ్ యాంక‌ర్ ర‌ష్మీ గురించి చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఈయ‌న‌కు యాంక‌ర్ ప్ర‌శ్నిస్తూ మీ సినిమాలో క‌నుక ఐట‌మ్ సాంగ్ ఉంటే ఏ హీరోయిన్ న‌టించాల‌ని భావిస్తార‌ని ప్ర‌శ్నించ‌గా.. ఈ ప్ర‌శ్న‌కు వైష్ణ‌వ్ స‌మాధానం చెబుతూ యాంక‌ర్ ర‌ష్మీ న‌టించాల‌ని కోరుకుంటాను అని షాకింగ్ స‌మాధానం చెప్పడం విశేషం. ర‌ష్మీలో హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ ప‌లికించే తీరు త‌న‌కు న‌చ్చుతుంద‌ని అందుకే త‌న సినిమాలో ఐట‌మ్ సాంగ్ లో ర‌ష్మి బాగుంటుంద‌ని ఈయ‌న చేసిన కామెంట్లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇది తెలిసి నెటిజ‌న్లు కూడా షాక‌వుతున్నారు. నిజంగా వైష్ణ‌వ్ సినిమాలో ఐట‌మ్ సాంగ్ ఉంటే ర‌ష్మికి అవ‌కాశం ఇస్తారో లేదో వేచి చూడాలి మ‌రి.

ఇది కూడా చ‌ద‌వండి :  పెద్ద పొర‌పాటు.. నిఖిల్‌కి బ‌దులు నితిన్‌..!

Visitors Are Also Reading