Home » మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత.. వరుడు కూడా ఫిక్స్.. అతనే అయి ఉంటాడా..?

మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత.. వరుడు కూడా ఫిక్స్.. అతనే అయి ఉంటాడా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. 500 రూపాయల జీతం నుంచి 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. ఈ స్థాయికి రావడానికి సమంత కష్టం మామూలుగా లేదు అని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే నాగచైతన్య పెళ్లి చేసుకొని అక్కినేని ఫ్యామిలీకి కోడలు అయింది. అలా కొంత కాలం కలిసి ఉన్న వీరిద్దరూ సడన్ గా విడాకులతో బయటకు విడిపోయారు. ఈ వార్త బయటకు రాగానే ఇండస్ట్రీ అంత షాక్ కు గురయింది.. ఇక అప్పటినుంచి వీరి విషయంలో అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Advertisement

also read:ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో న‌టుడు….! ప్ర‌తి సినిమాలో ప‌క్కా ఉండాల్సిందేనా..?

అయితే ఈ మధ్య కాలంలో సమంత తండ్రి జోసెఫ్ ప్రభు నాగచైతన్య తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ” చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది.. ఇకపై ఆ కథ ఉండకపోవచ్చు.. కొత్త కథలు కొత్త అధ్యాయాన్ని ప్రారంభం చేద్దామంటూ” క్యాప్షన్ రాసి తన కుటుంబ సభ్యులతో రిసెప్షన్ పెళ్లి సమయంలో ఉన్న నాగచైతన్య తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. ఇది చూసిన చాలామంది నెటిజన్స్ వీరు మళ్లీ కలుస్తున్నారు కావచ్చు అని భావించారు. ఇది జరుగుతున్న సమయంలోనే మరో విషయం తెరపైకి వచ్చింది. సమంత రెండో పెళ్లి కూడా చేసుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే భర్త కొరకే సమంత జూబ్లీహిల్స్ లో కొత్త విల్లా ని కూడా తీసుకుందని, దాని పునరుద్ధరణ పనులను జయభేరి సంస్థ చూస్తోందని తెలుస్తోంది. అయితే ఈ తరుణంలో సమంత పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరు అనేది అందరి మదిలో ఉన్న ప్రశ్న. సమంతా కొద్దిరోజులుగా ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి కూడా బీహార్ కు చెందిన వ్యక్తి అని అంటున్నారు. అతను గత కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారని, సమంత ఫ్లాట్లోనే ఉంటున్నారని, ఆ ప్లాట్ లో అతడిని చూసిన ఒక డైరెక్టర్ ఈ వార్త ఇండస్ట్రీలో కొందరికి చెప్పడం వల్ల ఇది కాస్త వైరల్ గా మారిందని తెలుస్తోంది. అయితే ఫ్యామిలీ మాన్ 2 షూటింగ్లో వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అసలు సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కూడా ఇదే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియాల్సి ఉంది.

also read:జీవితం మొత్తం న‌టిస్తూనే ఉన్న ఈ స్టార్ న‌టుల గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading