రేపు బీఏసీ సమావేశం తర్వాత సీఎల్పీ సమావేశం జరగనుంది. మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశం లో చర్చించనున్నారు.
ఏపీలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమ్మె నోటీసు ఇచ్చారు. అక్టోబర్ 2 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని 9 ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసు అందజేశారు.
Advertisement
చెన్నైలో రికార్డు స్ధాయిలో మల్లెపూల ధర పలుకుతోంది. మధురైలో కేజీ మల్లెపూల ధర మూడు వేలు పలుకుతోంది. ధరలు మరింత పెరగవచ్చని వ్యాపారులు అంటున్నారు. పంట దిగుబడి తగ్గడం….వరుసగా పండుగలు రావడంతో మల్లెపూల ధరలు ఆకాశాన్ని తాకాయి.
సీపీఎస్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. APCPSEA సంఘంతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు APCPSEA అధ్యక్ష, కార్యదర్శులతో చర్చలు జరుపనున్న జరపనున్నారు.
విజయవాడ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రందన సభ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు తరలివచ్చారు.
లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. హైదరాబాద్ లో ఆరుచోట్ల ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 30 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, బెంగళూర్ లో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. రామచంద్రన్ పిళ్ళై,అభిషేక్ రావ్ , సూదిని సృ జన్ రెడ్డి, రాబిన్ డిస్టిలరీస్, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
Advertisement
ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ లోపల ఉన్నచెత్త ను జీహెచ్ఎంసీ తీసివెస్తోంది.
భారీవర్షాలతో బెంగళూరు విలవిల లాడుతోంది. ఆఫీసులకు వెళ్లేందుకు ఐటీ ఉద్యోగులు, సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాల కు వెళ్లేందుకు ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్ లలో వెళుతున్నారు. భారీ వర్షాలతో యమలూరును వరద చుట్టేసింది.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆందోళనకు దిగింది. ర్యాలీకి పోలీసులు అనుమతించకపోవడం తో వాగ్వాదానికి దిగారు.
సీఎం జగన్ నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. సంగం…నెల్లూరు బ్యారేజ్ లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. సంగం వద్ద రైతు సదస్సులో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు.