డేవిడ్ వార్నర్ కు ఇండియాలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ అనేది ఉంది అందుకు కారణం అతను ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఛైదరాబాద్ జట్టులో ఆడటమే. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ జట్టుకు ఆడినా వార్నర్ కు ఇక్కడ ఫ్యాన్స్ తగ్గలేదు. అయితే ఐపీఎల్ వల్ల ఇండియాలో ఇంత క్రేజ్ తెచ్చుకున్నా వార్నర్ తన దేశంలో జరిగే లీగ్ క్రికెట్ లో పాల్గొనడం లేదు.
Advertisement
ఐపీఎల్ ను చూసి క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ ను ప్రారంభించింది. కానీ ఈ లీగ్ లో వర్బార్ తొమ్మిదేళ్లుగా ఆడటం లేదు. మొదటిసాటి ఈ లీగ్ లో సిడ్నీ థండర్ జట్టుకు ఆడిన వార్నర్ ఇప్పుడు మళ్ళీ అదే జట్టు తరపున ఆడటానికి ఒప్పుకున్నాడు. ఆ జట్టు యాజమాన్యంతో రెండేళ్ల ఒప్పందం అనేది చేసుకున్నాడు వార్నర్. ఇక తాను మళ్ళీ ఇందులో ఆడటానికి తన కుటుంబం కారణం అని చెప్పాడు.
Advertisement
తాజాగా వార్నర్ మాట్లాడుతూ.. నేను మొదటిసారి ఈ లీగ్ లో ఏ జట్టుకు ఆడనో ఇప్పుడు మళ్ళీ అదే జట్టుకు ఆడటం సంతోషంగా ఉంది. అయితే నన్ను ఈ లీగ్ ఆడటానికి బాగా ప్రోత్సహించింది నా కుటుంబం. నా కూతుర్లు నేను ఈ లీగ్ ఆడితే చూడాలని ఉంది అని.. నేను ఆడితే మేము సంతోషిస్తాం అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను కుటుంబంతో కలిసి ఈ లీగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది అని వార్నర్ అన్నాడు.
ఇవి కూడా చదవండి :