చిన్న సినిమాలకు బడ్జెట్ సమస్యలు రావడం సహజమే. సినిమాలు ప్రారంభమయ్యి, కొంత మేర షూటింగ్ జరిగిన తరువాత అవసరమైన బడ్జెట్ లేకపోవడంతో సినిమాలు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, స్టార్ హీరోలు ఒకసారి కమిటయ్య చిత్రం ప్రారంభమైతే తప్పనిసరిగా పూర్తి చేస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సినిమాలను రిలీజ్ చేస్తారు. చిన్న హీరోలే కాదు, స్టార్ హీరోల చిత్రాలు కూడా షూటింగ్ ప్రారంభించి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.
Advertisement
ఇలా మొత్తం 11 చిత్రాలు ఆగిపోయాయి. ఒకప్పుడు అట్టహాసంగా ప్రారంభించిన పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా ముహుర్తం తరువాత ఆగిపోయింది. బాలకృష్ణ నర్తనశాల సినిమా 17 రోజులు షూటింగ్ జరుపుకొని ఆగిపోయింది. రామ్ చరణ్ మెరుపు సినిమా కొన్ని రోజులు షూటింగ్ చేసి పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు జీసెస్ క్రైస్ట్ జీవితం ఆధారంగా చేయాలనుకున్న మూవీని పక్కన పెట్టేశారు.
Advertisement
కొరటాల శివ, రామ్ చరణ్ సినిమా సైతం ముహూర్తం తరువాత ఆగిపోయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం వినాలని ఉంది సైతం కొన్ని రోజులు షెడ్యూల్ తరువాత నిలిపివేశారు. చిరంజీవి అబు బాగ్దాద్, మెహర్ రమేష్, రవితేజ చిత్రం, వెంకటేష్ మారుతీ రాధా మూవీ, బాలకృష్ణ బీ గోపాల్ హరహరమహాదేవ, బాలయ్య విక్రమ సింహ భూపతి చిత్రాలు కొన్ని రోజులు షూటింగ్ చేసుకొని ఆగిపోయాయి. ఆగిపోయిన ఆ చిత్రాల గురించి స్టార్ హీరోలు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. నర్తనశాల సినిమాకు దర్శకత్వం వహించాలనుకున్న బాలకృష్ణ కల కలగానే మిగిలిపోయింది.