Home » ఆయ‌నను మార్చేసిన ఆ కార్టున్ క‌థ‌… చ‌దివితే మీరు కూడా…

ఆయ‌నను మార్చేసిన ఆ కార్టున్ క‌థ‌… చ‌దివితే మీరు కూడా…

by Bunty
Ad

కార్టూన్‌ల‌ను అంద‌రూ ఇష్ట‌ప‌డుతారు. న‌చ్చితే హాయిగా న‌వ్వుకుంటారు. న‌చ్చ‌కుంటే ప‌క్క‌న‌ప‌డేస్తారు. అందులో ఉండే సారాన్ని వ‌డ‌క‌ట్టి అవపోస‌న ప‌ట్టేవాళ్లు అతికొద్ది మంది ఉంటారు. అలా అవ‌పోస‌న ప‌ట్టినా దాన్ని ఇన్పిరేష‌న్‌గా జీవితంలో ఎదిగే వ్యక్తులు చాలా అరుదుగా క‌నిపిస్తారు. అలాంటి అరుదైన వ్య‌క్తుల్లో హెడ్‌డీఎఫ్‌సీ సీఈవో ఆదిత్య‌పూరి కూడా ఒక‌రు. ఆదిత్య‌పూరి తండ్రి ఎయిర్ పోర్స్ ఉద్యోగి కావ‌డంతో త‌న కొడుకును కూడా ఉద్యోగిగా చూడాల‌ని అనుకున్నాడు. సైన్స్ స‌బ్జెక్ట్ ను చ‌దివించాల‌ని అనుకుంటే ఆదిత్య పూరి కామ‌ర్స్ స‌బ్జెక్ట్‌ను ఎంచుకొని చార్టెడ్ ఎకౌంటెన్సీని పూర్తి చేసి సిటీ బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించారు.

Advertisement

Advertisement

అంచెలంచెలుగా ఎదుగుతూ ఢిల్లీ, హాంకాంగ్‌, మ‌లేషియా, సౌదీలో ప‌నిచేశారు. అయితే, ఢిల్లీకి చెందిన దీప‌క్ ప‌రేఖ్ తాను స్థాపించ‌బోయే బ్యాంకుకు హెడ్ గా ఉండాల‌ని కోరారు. ఒక కంపెనీకి లేదా సంస్థ‌కు హెడ్‌గా ప‌నిచేయడం అంటే ఎప్పుడూ స‌వాల్‌తో కూడుకుని ఉంటుంది. స‌వాల్‌ను ఛాలెంజ్‌గా తీసుకొని ప్ర‌తి ఏడాది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆర్ధికంగా ముందు ఉండేలా చేశారు. అయితే, ఓసారి ఓ కార్టూన్‌ను ఆదిత్య‌పూరి చూశారు.

రెండు బాక్సుల్లో ఉన్న ఆ కార్టున్ లో మొద‌టి బాక్స్‌లో బాస్ బిజీబిజీగా ఉంటే బ‌య‌ట ఉద్యోగులు నిద్ర‌పోతుంటారు. రెండో బాక్స్‌లో ఉద్యోగులు అంతా ప‌నిచేస్తుంటే బాస్ నిద్ర‌పోతుంటాడు. ఈ చిన్నకార్టూన్ ఆయ‌న్ను స‌మూలంగా మార్చివేసింది. ప‌నివేళల్లో ఎవ‌రూ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కుండా ప‌నిచేసేలా చేశారు. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయ‌డం వ‌ల‌న సంస్థ ముందుకు వెళ్తుంది. అదే ఒక్క‌రే ప‌నిచేసి మిగ‌తా వారు నిద్ర‌లోకి జారుకుంట ఆ సంస్థకు చివ‌ర‌కు మిగిలేది అప్పులు, తిప్ప‌లే.

Visitors Are Also Reading