సూపర్ స్టార్ మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి సినిమాని పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమాని ప్రదర్శించారు. ఇక ఈ సినిమాతో పాటు కొన్ని చోట్ల ఆయన నటించిన మరో చిత్రం ఒక్కడు సినిమా కూడా స్పెషల్ షో ప్రదర్శించబడ్డారు. ఇలా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాని 15 సంవత్సరాల తరువాత తిరిగి విడుదల చేయడం ఒక ఎత్తయితే.. దానిని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా చూడడం మరొక విశేషం. దాదాపు 15 సంవత్సరాల తరువాత ఈ సినిమా విడుదల కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివచ్చారు. ఈ సినిమా స్పెషల్ షో ద్వారా నిర్మాతలకు భారీగానే లాభాలను పొందినట్టు తెలుస్తోంది.
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన గంటల వ్యవధిలోనే బుకింగ్స్ క్లోజ్ అవ్వడం విశేషం. ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. పలు థియేటర్లలో స్పెషల్ షో ప్రదర్శించబడిన ఈ సినిమా నుంచి నిర్మాతలు సుమారుగా రూ.3కోట్లకు పైగా లాభాలను అందుకున్నారని సమాచారం. కలెక్షన్లు ఇలా వస్తాయని ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఈ సినిమా మాత్రమే కాకుండా ఒక్కడు సినిమా స్పెషల్ షో వేయడంతో ఒక్కడు చిత్ర బృందం కూడా హాజరై పోకిరిని వీక్షించారు.
Advertisement
Advertisement
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు సినిమాకి కూడా భారీగానే టికెట్లు అమ్ముడపోయాయని ఈ చిత్రం ద్వారా సుమారు 60 లక్షలకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానుల కోసం ఆయన నటించిన సినిమాలను తిరిగి విడుదల చేయడం ద్వారా నిర్మాతలు నాలుగు కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందారని సమాచారం. మహేష్‌బాబు సినిమాలను ఆదర్శంగా తీసుకొని ముందు ముందు మరికొంత మంది అగ్ర హీరోలు నటించిన సినిమాలు కూడా ఈ విధంగా స్పెషల్ షో ద్వారా ప్రదర్శించబడుతాయడనంలో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనే లేదు.
Also Read :
నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా స్పెషల్ అంటున్న మహేష్..ఎవరంటే..?