భారత్‌లో కొత్తగా 19,893 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,36,478 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
హైదరాబాద్ లోని అమ్నీషియా పబ్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. నాంపల్లి కోర్టు, పబ్ రేప్ కేసులో ఇప్పటికే ఐదుగురు జువెనైల్స్‌కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. గత వారమే పబ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ దాకలు చేశారు.
Advertisement
ఢిల్లీకి టెర్రర్ అలెర్ట్ ప్రకటించారు. దాడులకు ఐఎస్‌ఐ కుట్ర చేస్తోన్న నేపత్యం లో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. లష్కర్-ఇ-ఖల్సా దాడులకు దిగొచ్చని ఇంటిలిజెన్స్ అలెర్ట్ అయ్యింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2,21,483 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 64,170 క్యూసెక్కులు గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగుల వద్ద ఉండగా ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Advertisement
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.
ఈనెల 5న తెలంగాణ హైకోర్టుకు సెలవు ప్రకటించారు.12న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు ప్రకటించిన సెలవు రద్దు. చేశారు. ఈ నెల 12కు బదులు ఈ నెల 5న సెలవును ప్రకటిస్తూ హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.
లోన్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రజల డబ్బు దోచుకున్న చైనా కంపెనీలపై ఈడీ కొరడా జులుపిస్తోంది.12 NBFC కంపెనీలకు అనుబంధంగా లోన్‌యాప్ కంపెనీలు ఉన్నాయి. ఇండిట్రేడ్, ఫిన్‌క్రాఫ్, ఆగ్లో, ఫిన్‌ట్రైడ్‌తోపాటు ఫిన్‌టెక్ కంపెనీల నగదు సీజ్ చేశారు.
రేపటి నుంచి నియోజకవర్గాల కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రేపు కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కార్యకర్తల జాబితా పీకే టీమ్, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు సిద్దం చేస్తున్నారు.
నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని 18వ అంతస్తులో ప్రారంభించనున్నారు, ఆ తర్వాత మ్యూజియాన్ని కూడా ప్రారంభిస్తారు.