వరంగల్ లో రూ.1.40 లక్షలు లంచం తీసుకుంటుండగా స్టేషన్ ఘన్పూర్ ఎంపీడీవో దేశగాని కుమారస్వామి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
భారత్‌లో కొత్తగా 13,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా తో 34 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,39,792 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Advertisement
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగినట్టు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నం 12లోని వేమూరీ ఎన్ క్లేవ్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద కత్తి, పిస్టోల్ స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు.
ఏకనాథ్ షిండే సర్కార్ కూలిపోవడం ఖాయమని మాజీ సీఎం ఉద్దవ్ టాక్రే కుమారుడు ఆదిత్య టాక్రే వ్యాఖ్యానించారు. షిండే సర్కార్ సంక్షేమంపై కాకుండా డర్టీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టిందని అన్నారు.
వీఆర్వోల వ్యవస్థకు తెలంగాణ సర్కార్ స్వస్తి చెప్పింది వీరికి వేరే విధులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
Advertisement
హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు ఉ.9 గంటల నుంచి ఉ.11 గంటల మధ్య కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని…. ఈ సమయంలో వాహనదారులు బయటకు రావొద్దని కోరారు. వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటకు రావాలని జాయింట్ సీపి పేర్కొన్నారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు వచ్చాయి. మహిళల జుడోలో సుశీలా దేవికి రజతం దక్కగా….. పురుషుల 60 కిలోల విభాగంలో విజయ్ కుమార్‌కు కాంస్యం దక్కింది.
అల్‌ఖైదా అగ్రనేత అల్ జవహరీ ని హతమార్చారు. డ్రోన్ దాడుల ద్వారా అల్ జవహరీని అమెరికా హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు.
ఏపీలో ఈ నెల 3వ తేదీన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బెటర్మెంట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు.
తరుణ్ చుగ్‌తో ఈటల రాజేందర్, డీకే అరుణ భేటీ అయ్యారు. బీజేపీలో చేరికలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎల్లుండి మరోసారి ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో ఈటల, డీకే అరుణ భేటీ కానున్నారు.