సాధారణంగా మీరు రైలులో ప్రయాణించినప్పుడు రైలు బోగీ ఏ కలర్ లో ఉంటుంది..? రైళ్లు బ్లూ, రెడ్, గ్రీన్ కలర్‌లలో కనిపిస్తుంటాయి. వీటికి అర్థం ఏంటో తెలుసా..? ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద, ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్ అయిన భారతీయ రైల్వే దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రైళ్లను నడిపిస్తుంది.
Advertisement
రైలులో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. అసలు రైలు బోగీల రంగులు ఎందుకు వేర్వేరుగా ఉంటాయని ఆలోచించే ఆరు చాలా తక్కువ. రైలు బోగీలు ఆ రైలు మోడల్ ని తెలియజేస్తుంటాయి. వాటి రంగులు వేర్వేరుగా ఉంటాయి. ఎక్కువగా రైలు బోగీలు బ్లూ కలర్ లో అంటే నీలం రంగులో ఉంటాయి. ఈ బోగీలను ఇంటిగ్రేటెడ్ కోచ్ లో లేదా ఐసీఎఫ్ కోచ్‌లు అంటారు. ఈ రైలు వేగం గంటకు 70 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ బోగీలు మెయిల్ ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్ ఫాస్ట్ రైళ్లలో కనిపిస్తుంటాయి. ఇనుముతో తయారు చేసిన బోగీలు. వీటిని ఎయిర్ బ్రేక్‌లతో అమర్చుతారు.
Advertisement
ఇక భారతీయ రైల్వే ఎరుపు రంగు కోచ్‌లతో రైళ్లను నడుపుతోంది. రైలు బోగీలను లింక్ హాప్ మన్ బుష్ అంటే ఎల్ హెచ్‌బీ కోచెస్ అంటారు. జర్మనీ నుంచి ఈ బోగీలు 2వేల సంవత్సరంలో వచ్చాయి. గతంలో ఈ బోగీలు వేర్వేరు దేశాల్లో తయారయ్యేవి. పంజాబ్‌లోని కపుర్తలాలో భారతీయ రైల్వే తయారు చేస్తుంది. ఈ కోచ్‌లో అల్లూమినియంతో తయారవుతాయి. కాబట్టి బరువు తక్కువ. డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. బోగీల బరువు తక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. రాజధాని శతాబ్ది రైళ్లలో ఎల్‌హెచ్‌బీ బోగీలు చూడవచ్చు. ఈ రైళ్లన్నీ ఎక్కువ వేగంతో ప్రయాణించేవే. గ్రీన్ కలర్ బోగీలు గరీబ్ రథ్ రైళ్లకు కనిపిస్తాయి. మీటర్ గేజ్ రైళ్లకు గోదుమ రంగు బోగీలుంటాయి. నారో గేజ్ రైళ్లు కూడా ఇదే కలర్ లో కనిపిస్తుంటాయి. ప్రస్తుతం భారత్‌లో నారో గేజ్ రైళ్లు దాదాపు లేనట్టే.
రంగులు కాకుండా ఐసీఎఫ్ కోచ్‌ల పై పలు రంగులతో గీతలుంటాయి. కోచ్‌లలో చివరి విండోను గుర్తించడానికి ఈ గీతలను పెయింట్ చేస్తారు. నీలిరంగు రైల్వే కోచ్‌లపై తెల్లని చారలు కనిపిస్తాయి. అన్ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ బోగీలను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఆకుపచ్చ చారలతో ఉన్న బూడిద రంగు కోచ్‌లు మహిళలకు మాత్రమే అని సూచిస్తాయి. గ్రే కోచ్‌లపై ఎరుపు గీతలు EMU/MEMU రైళ్లలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లను సూచిస్తాయి. ముంబై లోకల్ రైళ్లకు పశ్చిమ రైల్వే ఇదేవిధంగా గీతలను ఉపయోగిస్తుంది.
Also Read :
“జబర్దస్త్” కామెడీ షోలో కట్టుకున్న చీరలను ఆ తరవాత ఏం చేస్తారో తెలుసా…?