Telugu News » Blog » “జ‌బ‌ర్ద‌స్త్” కామెడీ షోలో క‌ట్టుకున్న‌ చీర‌ల‌ను ఆ త‌ర‌వాత ఏం చేస్తారో తెలుసా…?

“జ‌బ‌ర్ద‌స్త్” కామెడీ షోలో క‌ట్టుకున్న‌ చీర‌ల‌ను ఆ త‌ర‌వాత ఏం చేస్తారో తెలుసా…?

by AJAY
Ads

తెలుగులో ఇప్ప‌టి వ‌రకూ ఎన్నో కామెడీ షోలు వ‌చ్చాయి. కానీ జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో అంత స‌క్సెస్ అయిన షో మ‌రొక‌టి లేదు. ఏళ్ల‌కు ఏళ్లుగా జ‌బ‌ర్ద‌స్త్ స‌క్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. ఈ షో ద్వారా ఎంతో మంది లైఫ్ లు సెటిల్ అయ్యాయి. అయితే రెమ్యున‌రేష‌న్ ఎక్కువ వ‌స్తుంద‌నే ఆశ‌తో ఇప్ప‌టికే చాలా మంది జ‌బ‌ర్దస్త్ ను వీడి వెళ్లిపోయారు. ఇక ఆ షోనే న‌మ్ముకుని బ్ర‌తుకుతున్న‌వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. జ‌బ‌ర్ద‌స్త్ ప్రారంభంలో కేవ‌లం మ‌గ‌వాళ్లు మాత్రం స్కిట్ లు చేసేవారు.

ఒక‌వేళ ఆడ‌వాళ్ల పాత్ర అవ‌స‌రం అయితే ఆ పాత్ర‌లో కూడా చీర‌లు క‌ట్టుకుని వాళ్లే న‌టించేవారు. అంతే కాకుండా కొంత‌మంది ట్రాన్స్ జెండ‌ర్ ల‌కు కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో అవ‌కాశం ఇవ్వ‌డం వాళ్ల జీవితాలు కూడా సెటిల్ అయ్యాయి. అలా జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ప్రియాంక సింగ్ పింకీకి ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ షో తో వ‌చ్చిన పాపులారిటీ తోనే ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ త‌ర‌వాత మ‌హిళ‌ల‌కు కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో అవ‌కాశాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

దాంతో మ‌హిళ‌లు కూడా కామెడీ చేసి ప్రేక్ష‌కుల‌ను నవ్వించారు. ఇక ఈ షోలో క‌నిపించిన లేడీ కంటెస్టెంట్స్ లో స‌త్య శ్రీ ఎక్కువ‌గా పాపులారిటీని సంపాదించుకుంది. స‌త్య‌శ్రీ ఎక్కువ‌గా చంద్ర స్కిట్ ల‌లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. చంద్ర‌కు భార్యగా న‌టిస్తూ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. కాగా తాజాగా స‌త్య‌శ్రీ జ‌బ‌ర్ద‌స్త్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న చీర క‌ట్టుకు అభిమానులు ఉన్నార‌ని చెప్పింది.

JABARDASTH SATHYA SRI

తాను చీర‌క‌ట్టుకుంటే వినోద్ ఎంత సేపు క‌ట్టుకుంటావ్ అంటూ హేళ‌న చేసేవాడ‌ని తాను అర‌గంట సేపు చీర క‌ట్టుకునేదాన్న‌ని చెప్పింది. చీర‌క‌ట్టుకుంటే అది డ్యాన్స్ చేసినా కూడా ఊడిపోకూడ‌ద‌ని చెప్పింది. ఇక తాను క‌ట్టుకున్న చీర‌లు అన్నీ త‌న త‌ల్లివే అని చెప్పింది. దాదాపు 500 ఎపిసోడ్ ల‌లో తాను క‌ట్టిన చీర‌ను మ‌రోసారి క‌ట్ట‌లేద‌ని పేర్కొంది. అంతే కాకుండా షో నిర్వాహ‌కులు ఇచ్చిన చీర‌ల‌ను మ‌రి కొన్ని స్కిట్ ల‌లో మార్చి మార్చి క‌ట్టుకుంటార‌ని వెల్ల‌డించింది.


You may also like