Home » భ‌ర్త‌ను వ‌దిలేసి మూడేళ్లుగా బాత్రూంలో నివ‌సిస్తున్న యువ‌తి.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

భ‌ర్త‌ను వ‌దిలేసి మూడేళ్లుగా బాత్రూంలో నివ‌సిస్తున్న యువ‌తి.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

by Anji
Ad

మ‌నిషికి క‌నీస అవ‌స‌రాల్లో ముఖ్య‌మైన‌వి కూడు, గూడు, గుడ్డ. వీటిలో ఏ ఒక్క‌టి లేక‌పోయిన‌ప్ప‌టికీ వారి జీవితం ఎంత దుర్భ‌రంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కామారెడ్డి జిల్లాలో ఓ అనాథ యువ‌తి గూడు చెదిరిపోవ‌డంతో చివరికీ ఆమె ఎక్క‌డ త‌ల‌దాచుకుందో తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. ఆమె చిన్న‌త‌నంలోనే తండ్రిని కోల్పోయింది. తాను పెద్ద‌యిన త‌రువాత అనారోగ్యం కార‌ణంగా త‌ల్లి కూడా మృతి చెంద‌డంతో ఒంట‌రిగానే మిగిలింది. గ్రామ‌స్తులంద‌రూ ఓ తోడు వెతికి పెళ్లి చేస్తే ఆ బంధం మ‌ధ్య‌లోనే తెగిపోయింది. ఎన్నో క‌ష్టాల‌ను భ‌రిస్తూ వ‌స్తున్న ఒంట‌రి యువ‌తిని చివ‌రికీ విధి కూడా వెక్కిరించింది. దీని ఫ‌లితంగా ఉండేందుకు ఇల్లు కూడా లేక‌పోవ‌డంతో బాత్రూమ్‌నే భ‌వంతిగా మార్చుకుని ద‌య‌నీయ జీవితాన్ని గ‌డుపుతోంది. ప్ర‌భుత్వం త‌న‌కు సాయం చేయాల‌ని కోరుతుంది.

Advertisement

వివ‌రాల్లోకి వెళ్లితే.. కామారెడ్డి జిల్లా దోమ‌కొండ మండ‌లం ఫ‌రీద్ పేట‌కు చెందిన క‌ర్రోళ్ల ఎల్ల‌య్య, ఎల్ల‌వ్వ దంప‌తులకు ఒక కూతురు ఆమె పేరు పోసాని. 23 ఏళ్ల యువ‌తికి ఊహ తెలియ‌క ముందే తండ్రి మృతి చెందాడు. తండ్రి లేకున్నా అన్ని తానై త‌ల్లి ఎల్ల‌వ్వ పెంచి పోషించింది. జీవితంలో అప్పుడే ఆనంద క్ష‌ణాలు అనుభ‌విస్తున్న స‌మ‌యంలో పోనాని త‌ల్లి ఎల్ల‌వ్వ కూడా మ‌ర‌ణించింది. దీంతో క‌న్న వారిని కోల్పోయిన పోసాని ఒంట‌రిగానే ఉంది. ఆమె త‌ల్లి చ‌నిపోయిన కొద్ది రోజుల‌కే పూరిల్లు కూలిపోయింది. యువ‌తి క‌న్న‌వాళ్లు లేని అనాథ‌గానే కాకుండా గూడులేని ప‌క్షిగా కూడా మారింది. పూరిల్లు కూలిపోవ‌డంతో ప్ర‌భుత్వ సాయంతో నిర్మించుకున్న మరుగుదొడ్డినే చివ‌ర‌కు త‌ల‌దాచుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Advertisement

ఇల్లు కూలి త‌ల్లిదండ్రులు దూర‌మైన ఓ ఒంట‌రి యువ‌తి ఆ మ‌రుగుదొడ్డిలోనే కాలం వెళ్ల‌దీస్తూ వ‌స్తోంది. విధి ఆడిన వింత నాట‌కంలో బ‌లైన పోసాని ప‌రిస్తితి గ‌మ‌నించిన గ్రామ‌స్తులు కొంత డ‌బ్బులు వేసుకుని వాడి గ్రామానికి చెందిన ఓ యువ‌కుడితో పెళ్లి జ‌రిపించారు. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేదు. పెళ్లి అయిన కొద్ది రోజుల‌కే కొన్ని కార‌ణాల వ‌ల్ల పొసాని భ‌ర్త‌కు దూరంగా ఉంటుంది. బీడీలు చుడుతూ జీవ‌నం కొన‌సాగిస్తోంది. ఇలా ఇంత‌టి దుర్భ‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న పోసానికి భారీ వ‌ర్షాలు కూడా ప్రాణ సంక‌ట‌గా మారాయి. వ‌ర్షాల కార‌ణంగా చుట్టుప‌క్క‌లకు పాములు, తేల్లు చేర‌డంతో భ‌యంతో బిక్కు బిక్కు మంటూ గ‌డుపుతుంది. ఎప్పుడే ఏ విష‌పు పురుగు వ‌చ్చి కాటేస్తుందోన‌నే భ‌యంతో నెట్టుకొస్తుంది. త‌న ప‌రిస్థితిని ప్ర‌భుత్వం అర్థం చేసుకొని ప‌క్కా ఇంటిని నిర్మించి ఆదుకోవాల‌ని పోసాని వేడుకుంటుంది. ఎవ‌రైనా మ‌న‌సున్న వారు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాల‌ని ఆ యువ‌తి కోరుతుంది.

Also Read : 

ఝాన్సీ కి రాణి సీరియ‌ల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

నిండు గ‌ర్భిణీ అయిన‌ప్ప‌టికీ ఒలింపియాడ్ బ‌రిలో హారిక‌

Visitors Are Also Reading