Home » జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ గుడ్ బై.. వైర‌ల్ అవుతున్న కామెంట్స్‌..!

జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ గుడ్ బై.. వైర‌ల్ అవుతున్న కామెంట్స్‌..!

by Anji
Ad

ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే బ‌జ‌ర్ద‌స్త్ షోతో ఎంతో పాపుల‌ర్ అయ్యారు యాంక‌ర్ అన‌సూయ‌. ఓ వైపు యాంక‌రింగ్ చేస్తూనే మ‌రొక వైపు సినిమాల్లో న‌టిస్తున్నారు. ముఖ్యంగా రంగ‌స్థ‌లం సినిమాలో అన‌సూయ న‌ట‌న ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. అదేవిధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా న‌టించింది. ఈమె బుల్లితెర‌పై మాత్ర‌మే కాకుండా వెండితెర‌పై కూడా దూసుకెళ్లుతుంది.


పుష్ప సినిమాలో సునీల్ భార్య దాక్షాయ‌ణి పాత్ర‌లో అన‌సూయ మొర‌టుగా క‌నిపించింది. అయితే పుష్ప -2లో ఆమె రోల్ ఎలా ఉంటుందోన‌ని ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ముఖ్యంగా పుష్ప‌-2లో అన‌సూయ పాత్ర షాకింగ్ గా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షోలో హాస్యం పండించ‌డంలో, ఎంట‌ర్‌టైన్ చేయ‌డంలో అన‌సూయ త‌న వంతు కృషి చేస్తుంది. చాలా కాలం నుంచి అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గా త‌మ స్కిట్స్‌తో న‌వ్వులు పూయిస్తుంటే అన‌సూయ గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకుంటూ వ‌చ్చింది. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి ఇటు ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ నుండి ఒక్కొక్క‌రుగా దూర‌మ‌వుతున్నారు. సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను ఇప్ప‌టికే జ‌బ‌ర్ద‌స్త్ ని వీడారు. నాగ‌బాబు, రోజా కూడా జ‌బ‌ర్ద‌స్త్ నుండి వెళ్లిపోయారు.

Advertisement

Advertisement

 

తాజాగా అన‌సూయ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె జ‌బ‌ర్ద‌స్త్‌ని వీడాల‌ని చాలా రోజుల నుంచి అనుకుంటున్న‌ప్ప‌టికీ అక‌స్మాత్తుగా త‌న డెసిష‌న్ ఇవాళ అప్లై చేసిందంట‌. అన‌సూయ ప‌రోక్షంగా కామెంట్స్ చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా నా కెరీర్‌లో నేను చాలా పెద్ద నిర్ణ‌యం తీసుకున్నాను. చాలా మెమొరీస్ నాతో తీసుకెళ్తున్నాను. ఇందులో ఎక్కువ‌గా గుడ్ మెమొరీస్ ఉన్నాయి. కొన్ని బ్యాడ్ మెమొరీస్ ఉన్నాయి. ఎప్ప‌టి మాదిరిగానే మీ ఆద‌ర‌ణ నాకు ఉంటుంద‌ని భావిస్తున్నా అని అన‌సూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి విడిచి వెళ్తుండ‌డంతోనే అన‌సూయ ఈ కామెంట్స్ చేసింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. సినిమా కెరీర్‌పై ఫోక‌స్ చేయాల‌నే ఉద్దేశంతో అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌టికి వ‌స్తున్న‌ట్టు స‌మాచారం.

Also Read : 

సినిమా రష్ చూసి అట్టర్ ఫ్లాప్ అనుకున్నారు..! తిరిగి చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ సినిమా ఏదంటే ?

తండ్రి అయిన టాలీవుడ్ నిర్మాత‌ దిల్‌రాజు.. వార‌సుడొచ్చాడంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్‌..!

 

Visitors Are Also Reading