Home » తండ్రి అయిన టాలీవుడ్ నిర్మాత‌ దిల్‌రాజు.. వార‌సుడొచ్చాడంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్‌..!

తండ్రి అయిన టాలీవుడ్ నిర్మాత‌ దిల్‌రాజు.. వార‌సుడొచ్చాడంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్‌..!

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్ల ఒక‌రైన దిల్ రాజు విజ‌య‌వంతమైన చిత్రాలు నిర్మించ‌డంతో దిల్‌రాజుకు తిరుగులేకుండా పోయింది. ముఖ్యంగా దిల్ సినిమాతో త‌న దిల్‌రాజుగా మారిపోయింది. అత‌ను సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటే ఆ సినిమా మినిమం గ్యారెంటీగా ఉంటుంది. అందుకే ఆయ‌న సినిమాల‌న్నీ విజ‌యాలు సాధిస్తుంటాయి. అయితే దిల్‌రాజు మ‌రొక సారి తండ్రి అయిన‌ట్టు తెలుస్తోంది. దిల్ రాజు త్వ‌ర‌లో శుభ‌వార్త చెబుతార‌ని టాలీవుడ్‌లో చ‌ర్చ న‌డుస్తున్న త‌రుణంలోనే బండ్ల గ‌ణేష్ ఆ సీక్రెట్‌ను రివీల్ చేశారు. ముఖ్యంగా దిల్ రాజుకు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశాడు బండ్ల గ‌ణేష్‌. దిల్ రాజు అన్న కంగ్రాట్స్ అని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. దిల్ రాజుకు కొడుకు పుట్టాడ‌ని తెలుపుతూ అస‌లు విష‌యాన్ని బ‌య‌టపెట్టాడు.

2017లో దిల్ రాజు మొద‌టి భార్య అనిత అకాల మృతి చెందారు. వీరికి హ‌న్షిత రెడ్డి అనే కూతురు క‌ల‌దు. భార్య చ‌నిపోయిన త‌రువాత రెండేండ్ల వ‌రకు దిల్ రాజు ఒంట‌రిగానే ఉన్నారు. కుమార్తె హ‌న్షిత‌, ఇత‌ర కుటుంబ సభ్యుల స‌ల‌హా మేర‌కు దిల్ రాజు 2020లో తేజ‌స్వినిని రెండ‌వ పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి త‌రువాత ఆమె గ‌ర్భం దాల్చింది. ఇప్పుడు ఈ దంప‌తుల‌కు పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించారు. ఈ వార్త తెలిసిన వెంట‌నే ప‌లువురు సెలెబ్రిటీలు, అభిమానులు సోష‌ల్ మీడియాలో దిల్ రాజు, తేజ‌స్విని దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Advertisement

Also Read : 

జ్యోతిక‌తో తొలి ప‌రిచ‌యం ఎలా అయిందో చెప్పిన సూర్య‌..ఆ సినిమా త‌రువాతే ప్రేమలో ప‌డ్డారా..?

Visitors Are Also Reading