సీఎం జగన్ దంపతులు నేడు విదేశాలకు పయనం అవుతున్నారు. రాత్రి 7.30కు సీఎం పారిస్ వెళ్లనున్నారు. జులై 2న జగన్ పెద్ద కుమార్తె యూనివర్సిటీ కాన్వొకేషన్లో పాల్గొననున్న పాల్గొంటారు. సీఎం కుమార్తె ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా దంపతులు హాజరుకానున్నారు.
ఈరోజు ఉదయం 11గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Advertisement
మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు నేడు కోర్టులో హాజరు కానున్నారు. 2019లో విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్ కోసం ధర్నా చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు వారిపై కేసు నమోదు చేసారు.
నేడు భారత్-ఐర్లాండ్ మధ్య రెండో (చివరి) టీ20 మ్యాచ్ జరగనుంది. డబ్లిన్ వేదికగా రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కాకినాడ జిల్లా తుని మండలంలో పెద్దపులి కలకలం రేపింది. కుమ్మరిలోవ శివారులో రోడ్డు దాటుతున్న బెంగాల్ టైగర్ ని స్థానికులు గుర్తించారు. ఈ సమాచారంతో ఫారెస్ట్ అధికారులు కుమ్మరిలోవ కు చేరుకున్నారు. స్థానికులు అప్రమత్తం గా ఉండాలని పోలీసులు ఆదేశించారు.
Advertisement
గత రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో కూకట్ పల్లి, జెఎన్టీయూ, సూరారం, జీడీమెట్ల, దుండిగల్, నిజాంపేట, మూసాపేటలో రోడ్లు జలమయం అయ్యాయి.
నేడు తెలంగాణ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.45 నిమిషాలకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
నేడు రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమకానున్నాయి. ఈ ఏడాది కొత్తగా అప్లై చేసుకున్నవారికి సైతం రైతు బంధు నిధులు జమ కానున్నాయి.
మంత్రి కేటీఆర్ కేంద్రానికి సవాల్ విసిరారు. కేంద్రానికి తెలంగాణ ఇచ్చ్చినదానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
గడిచిన 24 గంటలలో దేశంలో 11,793 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది కరోనా తో మరణించారు.