బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి సైతం విద్యార్థులు నిరసన కొనసాగించారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు లోపలి వైపు విద్యార్థుల నిరసన కొనసాగుతోంది.12 డిమాండ్ల పరిష్కారం కోసం రాత పూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
వర్షం కారణంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయ్యింది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా వర్షం పడటం తో మ్యాచ్ ను రద్దు చేశారు.
Advertisement
యూపీలోని వారణాసిలో చిక్కుకుపోయిన దక్షిణ భారత రాష్ట్రాల యాత్రికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దాంతో అవసరమైన సహాయం చేస్తామని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు.
నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకునిరావడమే లక్ష్యంగా పని చేయాలని అమిత్ షా సూచించారు. ఈటల వెంట ఏనుగు రవీందర్ సైతం ఉన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపత్ స్కీమ్ కు వ్యతిరేఖంగా ఆర్మీ అభ్యర్థులు నిరసనల కు దిగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా పంజాబ్ అసెంబ్లీ అగ్ని పత్ కు వ్యతిరేఖంగా తీర్మానం చేసింది.
Advertisement
తమిళనాడు లోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రధాని మోడీ చిన్నతనంలో చేసిన సాహసాన్ని పాఠ్యాంశం గా పొందుపరిచింది. ఓ టీవీ కార్యక్రమంలో మోడీ.. నేను కొలనులో స్నానం చేస్తుండగా మొసలి పిల్ల కనిపిస్తే దాన్ని ఇంటికి తీసుకెళ్లానని చెప్పారు. తన తల్లి చూసి తిట్టడంతో మళ్లీ వదిలిపెట్టానని తెలిపారు. ఇప్పుడు అదే విషయాన్ని స్కూల్ లో పాఠ్యాంశంగా చేర్చారు.
అగ్నిపత్ లో భాగంగా ఆర్మీ లో నియామక ప్రక్రియ కోసం ఈరోజు ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. తర్వాత సైన్యంలోని వివిధ రిక్రూట్మెంట్ విభాగాలకు జూలై 1నుండి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న ఐదు రోజుల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం, తమిళనాడు, మహారాష్ట్రలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టంచేసింది.
తెలంగాణలో పట్టణ జనాభా జాతీయ సగటు 31.16 శాతంగా ఉందని నీతిఅయోగ్ ప్రకటించింది. 46.8 శాతం గా ఉందని పేర్కొంది. 2025 నాటికి 50 శాతానికి చేరుకుంటుందని స్పష్టం చేసింది.
ఇథియోపియాలో రెండు తెగల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో ఏకంగా 230 మంది చనిపోయారు.