అగ్నివీర్ పోస్ట్ సర్వీస్ 4 సంవత్సరాలు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మూడున్నరేళ్లు సర్వీస్ లోకి తీసుకుంటారు. సర్వీస్ టైంలో 30 వేల నుంచి 40 వేల వరకు జీతం, ఇతర సదుపాయాలు ఉంటాయి. పనిచేసిన కాలానికి శాలరీస్ నుంచి 30 శాతం కట్ చేసి సేవ నిధి కింద జమ చేస్తారు. దీనికి సమానంగా కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటా జమ చేస్తుంది. మొదటి సంవత్సరం ప్రతి నెల 30 వేల జీతం ఉంటుంది.
Advertisement
అయితే ఇందులో 21 వేల రూ.ఎంప్లాయిస్ చేతికి అందగా,మరో 9 వేలు కార్పస్ ఫండ్ కు వెళ్తాయి. మరో 9 వేలు కార్పస్ ఫండ్ లో కేంద్రం జమ చేస్తుంది. రెండో సంవత్సరం ప్రతినెలా 33,000 మూడో సంవత్సరం ప్రతినెలా 36,500, నాలుగు ఏడాదికి ప్రతి నెలా 40 వేల జీతం ఉంటుంది. ఇందులో కూడా కొంత మొత్తాన్ని కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు. అంతే మొత్తంలో కేంద్రం కూడా జమ చేస్తుంది.
Advertisement
నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్ టైం లో ఏకమొత్తంగా రూ. 11.71 లక్షల సేవా నిధిని కేంద్రం అందిస్తుంది. బ్యాంకు నుంచి 16.5 లక్షల లోన్ సదుపాయం కల్పిస్తోంది. 48 లక్షల రూపాయల భీమా ఉంటుంది. నాలుగేళ్ల సర్వీస్ లో ఎక్కువ ప్రతిభ చూపిన 25 శాతం మందిని ఇంకింత మంచి ప్యాకేజీతో రెగ్యులర్ కమిషన్ లోకి తీసుకుంటుంది. రెగ్యులర్ కమిషన్ కు ఎంపిక కాని వారు రిటైర్మెంట్ తర్వాత ఉపాధి అవకాశాలు పొందేలా రూల్స్ లో మార్పులు ఉంటాయి.
also read;
రామ్ చరణ్ బాలనటుడిగా నటించిన సినిమా ఏదో మీకు తెలుసా..?
వణుకుతున్న ఉత్తర కొరియా.. మరో అంటువ్యాధి పంజా విసురుతోంది..?