Home » మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌- సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమా స్టోరీ లీకు అయిందా..?

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌- సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమా స్టోరీ లీకు అయిందా..?

by Anji
Ad

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ హీరో మ‌హేష్‌బాబు కాంబోలో ఓ సినిమా చేయ‌నున్న విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. అయితే ఈ సినిమా మ‌హేష్‌ కెరీర్‌లో 28వ సినిమా. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు సినిమాలు వ‌చ్చాయి. అత‌డు, ఖ‌లేజా. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత‌డు సినిమా ఎంత సూప‌ర్ హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఖ‌లేజా మాత్రం ఆశించిన ఫ‌లితం దక్కించుకోలేదు. ఇక చాలా ఏళ్ల త‌రువాత వీరి కాంబోలో సినిమా వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై అంద‌రూ భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. మహేష్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని కాంబోలో వచ్చే సినిమా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు త్రివిక్రమ్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథ ఇదే అని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా కంటెంట్ తో పోలి ఉందని సమాచారం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో తన తండ్రి ఫ్రెండు ఇంట్లో కి వెళ్లడం.. హీరోయిన్ వాళ్ళ చెల్లి తో లవ్ లో పడడం జరుగుతుందట. ఈ సినిమా కథ ఇదే అని ప్రస్తుతం విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఇదే అయినప్పటికీ టేకింగ్ మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Advertisement

ఈ చిత్రంలో మహేష్ బాబు, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతమందిస్తున్నాడు. జూన్ రెండవ వారం నుండి రెగ్యులర్గా షూటింగ్ జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. త్రివిక్రమ్ ను ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇటీవలే మహేష్ బాబు నటించిన వారి వారి పాట హిట్ కావడంతో ఏసు ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి భారత్కు వచ్చిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగులో హాజరు కానున్నాడు.

Also Read :

నిద్రిస్తున్న వ్య‌క్తిపై భారీ కొండ చిలువ‌లు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

పాటల రచయిత చంద్రబోస్ భార్య ఎవరో తెలుసా…ఆమె ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్య పోతారు..!

 

Visitors Are Also Reading