Home » సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..

సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..

by AJAY
Ad

ఒకప్పుడు కమెడియన్ గా చేసిన సునీల్ ప్రస్తుతం విలన్ గా, హీరోగా కూడా నటిస్తున్నారు. కమెడియన్ గా సునీల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సొంతం సినిమాలో సునీల్ చేసిన కామెడీ ఆ సినిమా కే హైలెట్. అలాంటి సినిమాలు సునీల్ ఖాతాలో ఎన్నో ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వం లో సునీల్ మొదటి సారి మర్యాద రామన్న సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో కమెడియన్ పాత్రలకు గుడ్ బై చెప్పి పూర్తిగా హీరోగా నటిస్తానని ప్రకటించాడు. కానీ హీరోగా రెండు మూడు హిట్స్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆ తరవాత చాలా కాలానికి కమెడియన్ గా చిరు నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా లో నటించాడు. కానీ సునీల్ కామెడీ టైమింగ్ పోయిందని చాలా మంది అనుకున్నారు. ఆ తర్వాత మరో సినిమా లో కూడా కమెడియన్ గా చేశాడు.

Advertisement

కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక కలర్ ఫోటో సినిమాతో సునీల్ విలన్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో విలన్ గా ప్రేక్షకులను మెప్పించాడు. దాంతో క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించి సునీల్ తన నటనతో ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా ఈ సినిమా తో సునీల్ పాన్ ఇండియా కు పరిచయం అయ్యాడు. దాంతో ప్రస్తుతం సునీల్ చేతిలో రెండు మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే సునీల్ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. సునీల్ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలోనే బంధువుల అమ్మాయి శృతి ని వివాహం చేసుకున్నాడు. అయితే సునీల్ భార్యను చాలా మంది చూసి ఉండరు. కానీ రీసెంట్ గా సునీల్ భార్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సునీల్ కు ఒక పాప, బాబు కూడా ఉన్నారు. సునీల్ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం తో తల్లి దగ్గరే పెరిగాడు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాడు.

Also read :

సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె భర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా..!

Visitors Are Also Reading