వరకట్న వేధింపులను భరించలేక కేరళలోని కొల్లాంలో 2021 జూన్ నెలలో విస్మయ అనే యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు తీర్పునకు కొన్ని గంటల ముందే విస్మయపై జరిగిన దాడి గురించి తెలిపే ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి రావడం విశేషం. వివరాల్లోకి వెళ్లితే.. ఆయుర్వేద వైద్య విద్యార్థిని ఆమెకు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్న కిరణ్‌తో పెళ్లి జరిగింది. గత సంవత్సరం జూన్ 21న విస్మయ కొల్లాం జిల్లా శాస్తంకోటలో తన భర్త ఇంట్లో బాత్‌రూమ్‌లో ఉరేసుకుని మరణించింది. ఇక ఆ తరువాత ఈ కేసులో కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. విస్మయ తండ్రి, సోదరుడి ఫిర్యాదు మేరకు జనవరి 10, 2022న విచారణ ప్రారంభించారు.
ఇక ఈ కేసుకు సంబంధించి విస్మయ భర్త కిరణ్ కుమార్‌పై భారతీయ శిక్షాస్మృతి 304 (బీ) 498 (ఏ), 306, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. వరకట్న నిషేద చట్టంలోని సంబంధిత సెక్షన్లు కూడా అతనిపై మోపారు. ఈ కేసుకు సంబంధించి విచారణను కొల్లాం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు పూర్తి చేసింది. ఈ తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు కోర్టు వెల్లడించింది. తీర్పుకు ముందే ఆడియో క్లిప్ విస్మయకు, ఆమె తండ్రి త్రివిక్రమన్ నాయర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషన జరిగింది. ఆమె మరణించడానికి ముందు తాను ఎదుర్కొన్న హింస గురించి తండ్రి వద్ద ప్రస్తావించారు. భర్త కిరణ్ దాడి చేస్తున్నాడని.. భయంగా ఉందని విస్మయ చెప్పారు.
Advertisement
Advertisement
కిరణ్ తనను దారుణంగా కొడుతున్నారని, అవమానిస్తున్నారని ఏడుస్తూ తన తండ్రికి చెప్పారు. కిరణ్‌తో కలిసి బతకలేను అని, ఈ వేధింపులు భరించలేనని చెప్పారు. ముఖ్యంగా తనను కిరణ్ ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని తండ్రిని కోరింది విస్మయ. న’న్ను ఇక్కడే వదిలేస్తే నేను బతకలేన’ని.. నేను ఇంటికి తిరిగి రావాలని, కిరణ్ నాపై దాడి చేస్తున్నాడ’ని, భ’యంగా ఉంద’ని. నేను ఏదో ఒకటి చేస్తాన’ని విస్మయ త’న తండ్రితో చెప్పారు. విస్మయ తల్లి, స్నేహితురాలు, కిరణ్ సోదరికి పంపిన వాట్సాప్ సందేశాలను ప్రాసిక్యూషన్ కోర్డుకు అందజేసింది.
ఇక ప్రాసిక్యూషన్ 41 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామినేట్ చేసింది. 118 డాక్యుమెంట్లు, 12 అఫిడవిట్లను సమర్పించింది. ఫోన్ ప్రసంగాలు, సందేశాలను సాక్షంగా తీసుకోలేం అని నిందితుడు వాదించాడు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. మే 23న తీర్పు వెలువరించనున్నది. శాఖపరమైన విచారణ తరువాత రవాణాశాఖలో పని చేస్తున్న కిరణ్‌కుమార్ పై ఉన్నతాధికారులు వేటు వేసారు. విస్మయ భర్త కిరణ్ కుమార్‌ను కోర్టు శిక్షిస్తోందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆశిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
ఎయిర్‌టెల్ వినియోగదారులకు మరోసారి షాక్.. పెరగనున్న రీచార్జ్ ధర్లు..!
చికెన్, మటన్ ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్ రాకూడదంటే ఈ ఆకు తప్పకుండా తినాల్సిందే..!