Home » Karthika Deepam 12 May Today Episode : నిరుప‌మ్ తో పెళ్లి ఇష్టం లేద‌ని నిశ్చితార్థంలో హిమ ఎందుకు చెప్పింది..?

Karthika Deepam 12 May Today Episode : నిరుప‌మ్ తో పెళ్లి ఇష్టం లేద‌ని నిశ్చితార్థంలో హిమ ఎందుకు చెప్పింది..?

by Anji
Ad

Karthika Deepam 12 May Today Episode: సాధార‌ణంగా సాయంత్రం 7.30 అయిందంటే చాలు.. కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ఎంతో మంది ఎగ‌బ‌డి చూస్తుంటారు. ఇవాళ 12 మే, 2022 ఎపిసోడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జ్వాల‌ను షాపింగ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి.. అక్క‌డి నుంచి ఐస్‌క్రీమ్ షాపు వ‌ద్ద‌కు తీసుకొస్తుంది తింగ‌రి. ఇవాళ ఎలాగైనా జ్వాల‌కు అస‌లు వాస్త‌వం చెప్పాల‌ని హిమ అనుకుంటుంది. నీకు నేను ఓ ముఖ్య‌మైన మాట చెప్పాలంటుంది హిమ‌. నేనుకూడా నీకు ఓ ముఖ్య‌మైన విష‌యం చెప్పాలి తింగ‌రి అని జ్వాల అంటుంది. డాక్ట‌ర్ గురించి ఈ తింగ‌రికి చెబితే త‌ప్పు ఏముంది. ఏమైనా ఐడియా ఇస్తుందేమో అని జ్వాల అనుకుంటుంది. ముందు నువ్వే చెప్పు అని జ్వాల అంటుంది. ముందు నువ్వె చెప్పు అంటుంది తింగ‌రి.


ఇంత‌లోనే జ్వాల‌కు ఫోన్ రావ‌డం.. లోన్ గురించి ఫోన్‌లో మాట్లాడుతారు. నాకు లోన్ వ‌ద్దు.. గీన్ వ‌ద్దు అని ఫోన్ పెట్టేస్తుంది జ్వాల‌. ఈ ఫోన్ చూసావా.. డాక్ట‌ర్ సాబ్ గిప్ట్ ఇచ్చార‌ని అంటుంది. డాక్ట‌ర్ సాబ్ చాలా మంచోడు క‌దా అని జ్వాల అంటుంది. ఏదో చెబుతా అన్నావు తింగ‌రి చెప్పు అంటుంది జ్వాల‌. ఇదే స‌మ‌యంలోనే ఐస్‌క్రీమ్ రావ‌డం.. తీసుకోవ‌డం ఇలాంటి ఐస్‌క్రీమ్‌లు ఈ మ‌ధ్య కాలంలో తిన‌లేదు. ఓ ప‌ట్టు ప‌ట్టాల్సిందే అంటుంది జ్వాల‌. చెప్పు తింగ‌రి, ఏదో చెబుతా అన్నావు క‌దా అని జ్వాల అడుగుతుంది. దీంతో నువ్వు ముందు తృప్తిగా తిను. త‌రువాత మ‌నం తీరిక‌గా మాట్లాడుకుందామంటుంది జ్వాల‌.

Advertisement

ఇదే స‌మ‌యంలో త‌న డ్రెస్ మీద ఐస్‌క్రీమ్ ప‌డ‌డంతో క‌డుక్కునేందుకు వాష్‌రూమ్ వ‌ద్ద‌కు జ్వాల వెళ్తుంది. వ‌చ్చే స‌రికి తింగ‌రి క‌నిపించదు. ఎక్క‌డికి వెళ్లింద‌ని అక్క‌డ ఉన్న వాళ్ల‌ను త‌ను అడిగితే బిల్ పే చేసి వెళ్లిపోయిందని చెబుతారు. తాను ఎక్క‌డికి వెళ్లి ఉంటుంద‌ని అనుకుంటుంది. ఎంత అర్జెంట్ ప‌ని ఉందో ఏంటో అని అనుకుని అక్క‌డి నుంచి జ్వాల కూడా వెళ్లిపోతుంది. ఇక మ‌రొక వైపు ప్రేమ్‌కు చాలా చిరాకు వేస్తుంది. ఏమి చేయాలో అర్థం కాదు. గ‌ట్టిగా అరుస్తాడు. ఏంటి అమ్మ‌మ్మ ఇలా చేసావు. న ఆశ‌ల మీద నిప్పులు పోశావు అని.. నా ప్రేమ‌ను స‌మాధి చేశావ‌ని అనుకుంటాడు.

Advertisement


హిమ నా స‌ర్వ‌స్వం అనుకున్నాను. ఫోటోగ్ర‌ఫీ క‌న్నా ఎక్కువ‌గా ప్రేమించానని అనుకుంటాడు. ఆ త‌రువాత హిమ ఫోటోలు అన్ని త‌న ఫోన్‌లో నుంచి డిలీట్ చేస్తాడు. అమ్మ‌మ్మ‌కు తెలుసు క‌దా. చిన్న‌ప్ప‌టి నుండి హిమ అంటే ఎంత ఇష్ట‌మో తెలిసి కూడా ఇలా చేసిందేమిటి అని అనుకుంటాడు ప్రేమ్‌. ఇంత‌లో నిరుప‌మ్‌, హిమ ఇద్ద‌రి ఎంగేజ్‌మెంట్ కోసం రింగ్ కొందా ప‌దా అని అడుగుతాడు స‌త్యం. ప్రేమ్ నేను రాలేనంటాడు. మ‌రొక వైపు నీ ఎంగేజ్‌మెంట్ కోసం నీ ఫ్రెండ్‌ను తీసుకురాక‌పోయావా అని అడుగుతుంది హిమ‌ను సౌంద‌ర్య‌. త‌రువాత నిన్ను ఓ మాట అడ‌గ‌వ‌చ్చా అని హిమ సౌంద‌ర్య‌ను అంటుంది. నువ్వు ఏమి అనుకుంటున్నావో నాకు తెలుసు. అక‌స్మాత్తుగా ఈ ఎంగేజ్‌మెంట్ ఏంటి అని అంటావా అంటుంది. కేవ‌లం ఎంగేజ్‌మెంట్ మాత్ర‌మే. పెళ్లి శౌర్య దొరికాకే జ‌రుగుతుంది. నీ పెళ్లిలోపు శౌర్య‌ను నేనే వెతికి తీసుకొచ్చి అప్పుడే నీ పెళ్లి చేస్తానంటుంది.


అయ్యో నాన్న‌మ్మ‌.. జ్వాల‌నే శౌర్య అని నీకు తెలియ‌దు. ఆ మాట నీకు చెప్పాల‌ని ఉన్నా.. చెప్ప‌లేని ప‌రిస్థితి నాది. దాని మ‌న‌సులో అనుకుంటుంది తింగ‌రి. మ‌రొక వైపు జ్వాల చాలా సంతోషంగా ఉంటుంది.హిమ కొన‌చ్చినచీర‌ను చూస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఆ చీర‌ను త‌న‌కోసం డాక్ట‌ర్ సాబ్ పంపించాడ‌ని ఫుల్ ఖుషీ అవుతోంది. ఇక ఆ త‌రుఆవ‌త ఏమి జ‌రుగుతుందో తెలియాలంటే మాత్రం త‌రువాయి భాగంలో తెల‌సుకోవాల్సిందే..!

Also Read : 

పెళ్లి చేసుకోకుండానే పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సెల‌బ్రెటీలు వీళ్లే..!

రికార్డు స్థాయిలో చికెన్ ధ‌ర.. ఏపీలో కేజీ చికెన్ ధ‌ర‌ ఎంతంటే..?

 

Visitors Are Also Reading