Home » ‘అస‌ని’ తుఫాన్‌ అని పేరు ఏదేశం పెట్టిందో తెలుసా..?

‘అస‌ని’ తుఫాన్‌ అని పేరు ఏదేశం పెట్టిందో తెలుసా..?

by Anji
Ad

తుఫాన్ల‌కు పేర్లు పెట్టే సంప్ర‌దాయాన్ని 2000 సంవ‌త్స‌రం నుంచి యునైటేడ్ నేష‌న్స్ ఎకాన‌మిక్ అండ్ సోష‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ ఏసియా అండ్ ప‌సిఫిక్ వ‌ర‌ల్డ్ మెట్ర‌లాజిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ సంయుక్తంగా ప్రారంభించాయి. భార‌త్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, మ‌య‌న్మార్‌, ఒమ‌న్‌, పాకిస్తాన్‌, శ్రీ‌లంక‌, థాయ్‌లాండ్ దేశాలు ఉన్నాయి. ఒక్కోదేశం 13 పేర్ల‌తో ఓ జాబితాను త‌యారు చేసింది. బంగాళాఖాతం, అరేబియా స‌ముద్రాల్లో పుట్టే తుఫాన్ల‌కు ఈ పేర్లను పెడుతుంటారు.

Advertisement

ఇక 2018లో ఇరాన్, ఖ‌తార్‌, సౌదీ అరేబియా, యూఏఈ, యెయెన్ దేశాలు కూడా ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల స‌భ్యుల‌తో ఏర్పాటు అయిన ప్యానెల్ తుఫాన్ల పేర్ల‌ను నిర్ణ‌యిస్తుంది. ప్యానెల్ స‌భ్యులు ప్ర‌తిపాదించిన పేర్ల‌ను ఆయా దేశాల అక్ష‌ర క్ర‌మంలో ఉంచుతారు. ఈ దేశాల జాబితాలో తొలి పేరు బంగ్లాదేశ్‌ కాగా.. భార‌త్ పేరు రెండ‌వ పేరు. ఆ త‌రువాత ఇరాన్‌, మాల్దీవులు, ఓమ‌న్‌, పాకిస్తాన్‌, ఖ‌తార్,  శ్రీ‌లంక ఇలా కొనుగుతున్నాయి.


ఇక ప్ర‌స్తుత తుఫాన్‌కు పేరు పెట్టింది శ్రీ‌లంక దేశం. సింహాళి భాష‌లో అస‌ని అంటే అర్థం కోపం. ముఖ్యంగా ఈ తుఫాన్‌కు పెట్టే పేరు 8 అక్ష‌రాల‌కు అస‌లు మించ‌కూడ‌ద‌ట‌. ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఇవే రూల్స్‌ను పాటిస్తార‌ట‌. వాతావ‌ర‌ణ కేంద్రాల నుంచి వ‌చ్చే స‌మాచారంలో ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా అంద‌రూ ఐడెంటిపై చేయ‌డానికి తుఫాన్ల‌కు పేరు పెట్ట‌డం చేస్తారు. ముఖ్యంగా ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒక‌టి క‌న్న ఎక్కువ తుఫాన్లు సంభవిస్తే వాటి మ‌ధ్య తేడా ప్ర‌భావాల‌ను అంచ‌నా వేసేందుకు ఈ పేర్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయి. సాదార‌ణంగా 61కి.మీ. వేగంతో తుఫాన్ వ‌చ్చిన‌ప్పుడే దానికి పేరు ప్ర‌క‌టిస్తారు.

Advertisement

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అస‌ని తుఫాన్ ప్ర‌భావం క‌నిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర‌, కోస్తా జిల్లాల‌తో పాటు రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో కూడా వ‌ర్షాలు ప‌డుతాయి. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి, కోన‌సీమ‌, ఏలూరు, బాప‌ట్ల‌, కృష్ణా జిల్లాల ప‌రిధిలో కొంత మేర‌కు భారీ వ‌ర్షాలు కురిసాయి. అన‌కాప‌ల్లి, ప్ర‌కాశం, నెల్లూరు, జిల్లాల ప‌రిధిలో వ‌ర్షాల తాకిడి క‌నిపిస్తోంది. ఇక ఏపీ సీఎం జిల్లా క‌డ‌ప‌లో ఎడ‌తెరిపిలేని వ‌ర్షాలు న‌మోదు అయ్యాయి. తుఫాన్ తీవ్ర‌త క్ర‌మ క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌ట్టింద‌ని ఏపీ విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ ప్ర‌క‌టించింది. మ‌రొక‌వైపు బంగారు రంగులో ఉన్న‌టువంటి ర‌థం శ్రీ‌కాకుళం జిల్లా సంత‌బొమ్మాళి మండ‌లం ఎం.సున్నాప‌ల్లి మ‌త్స్యకార గ్రామ తీరానికి కొట్టుకుని వ‌చ్చింది. స‌ముద్రంలో తేలుతున్న ఈ మందిరాన్ని స్థానిక మ‌త్స్య‌కారులు గుర్తించ‌డంతో స్థానికులు దానిని చూసేందుకు బారులు తీరారు. పోలీసులు వారిని క‌ట్ట‌డి చేశారు.

Also Read : 

సూపర్ స్టార్ కృష్ణ సినిమాకి పోటీగా “దేవదాస్” రీరిలీజ్ చేసిన ANR దెబ్బకు కృష్ణ గారికి మైండ్ బ్లాక్ ..!

భారీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్.. ఒక కుటుంబంలో ఒకరికి టికెట్..!!

 

Visitors Are Also Reading