Home » అజ‌య్ దేవ‌గ‌న్ …30 ఏళ్ల కెరీర్…ఒడిదుడుకుల‌తో సాగిందిలా!

అజ‌య్ దేవ‌గ‌న్ …30 ఏళ్ల కెరీర్…ఒడిదుడుకుల‌తో సాగిందిలా!

by Azhar
Ad

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మూడు ద‌శాబ్దాలు అయింది. 1991లో ఫూల్ ఔర్ కాంటేతో అరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో త‌న కెరీర్ మొద‌ల‌యి ఎన్నో ఒడి దుడుకుల‌ను త‌ట్టుకుని గ‌త 30 ఏళ్ళుగా త‌న సినీ కెరీర్‌ని కొన‌సాగిస్తున్నారు. 1991లో, నటుడు అజయ్ దేవగన్ ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో రెండు మోటార్‌సైకిళ్లపై ప్రయాణిస్తూ అందరి హృదయాల్లోకి ప్రవేశించాడు. అతను త‌న త‌దుప‌రి చ‌త్రం కోసం వేచి చూస్తున్నారు.

‘అగర్‌ తేరే పాస్‌ జాగీర్‌ హై, తో మేరే పాస్‌ జిగర్‌ హై’ అని డైలాగ్‌ చెప్పి ప్రేక్షకుల మ‌న‌సులో చెర‌గ‌ని ముద్ర వేశాడు అజ‌య్‌దేవగన్‌. ఆయన తొలిచిత్రం ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’లోని ఈ డైలాగ్‌ అజయ్‌కు స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. నవంబర్‌ 22న అజయ్‌ దేవగన్‌ తన 30 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో ‘జఖ్మ్‌, ఇష్క్‌, దిల్జాలే, హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌, ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌, యువ, ఓంకార, సింగం, బోల్‌ బచ్చన్‌’ వంటి చిత్రాల్లో అత్యద్భుత‌మైన న‌ట‌న‌న‌ను ప్ర‌ద‌ర్శించారు.

Advertisement

‘అజయ్ దేవగన్‌ తన మొదటి చిత్రం ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ నవంబర్ 22న విడుదలవడంతో చలన చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకుంది. అజయ్‌ మృదుస్వభావి. అనవసర విషయాల్లో జోక‍్యం చేసుకోరు. ఇంకా సినిమా పట్ల మంచి అభిరుచి కలిగి ఉన్నారు. నా అభినందనలు అజయ్. మీరు మరో 70 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నా.’ అంటూ బిగ్‌ బీ అమితాబ్‌ రాసుకొచ్చారు. మరోవైపు అక్షయ్‌ కుమార్‌ ఇలా ‘మనం కొత్తవారిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది. నేను నువ్వు జుహు బీచ్‌లో మార్షల్‌ ఆర్ట్స్ సాధన చేసేవాళ్లం. మీ నాన్న మనకు శిక్షణ ఇచ్చేవారు. ఎంత మంచి రోజులవి. అలాగే నీ మొదటి చిత్రం ‘ఫూల్‌ ఔర్‌ కాంటే ‘ వచ్చి 30 ఏళ్లు అవుతుంది. సమయం గడిచిపోతుంది. కానీ స్నేహం అలాగే ఉంటుంది.’ ట్వీట్ చేశారు.

Advertisement

‘ఈ చిత్రం అజయ్‌ను చిత్రసీమకు పరిచయం చేయడమే కాకుండా రెండు బైక్‌లపై అతను ఇచ్చిన ఎంట్రీ సీన్ అప్పట్లో సంచలనంగా మారింది. ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైనది. ఈ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నా అరం‍గ్రేటం. ఆస్ట్రైడ్‌లో రెండు బైక్‌లపై ఎంట్రీ ఇవ్వడం నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ కదిలై బైక్‌లపై స్టంట్‌ చేసినప్పుడు అనుభవించిన థ్రిల్‌ నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి హిందీ సినిమా దాని పరిధులను విస్తృతం చేసుకుంటూ, అభివృద్ధి చెందుతోంది. ఈ పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టం. 30 ఏళ్ల తర్వాత ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ను మళ్లీ వీక్షించడం భావోద్వేగంగా అనిపిస్తుంది.’ అని అజయ్‌ దేవగన్‌ తన అనుభవాలను పంచుకున్నారు.

ఈ ఫూల్ అవుర్ కాంటే చిత్రం చాలా మంది హీరోలు ఆద‌ర్శంగా తీసుకుని దాదాపు అన్ని భాష‌ల్లో హీరోలు చేశారు. తెలుగులో ఇదే చిత్రం వార‌సుడిగా విడుద‌ల‌యింది. అజ‌య్‌దేవ‌గ‌న్ పాత్ర‌లో నాగార్జున‌, అమ్రిష్‌పురి పాత్ర‌లో కృష్ణ న‌టించారు. దీనికి ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే త‌మిళ్‌లో ప‌రంప‌రగా విడుద‌ల‌యింది. అందులో ప్ర‌భు,రోజా హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఇలా అన్ని భాష‌ల్లోనూ ఆచిత్రం హిట్ అయింద‌ని చెప్పాలి.

Visitors Are Also Reading