భారతదేశం అంటేనే సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇందులో ఒక్కొక్క మతానికి ఒక సంప్రదాయం ఉంటుంది. సర్వమత సమ్మేళనం ఈ భారతదేశం. అయితే మనం ఎలాంటి పండగ చేసుకున్న శుభకార్యం చేసుకున్న దీపం మాత్రం తప్పనిసరిగా పెడతాం. మరి ఈ సమయంలో ఉపయోగించే వత్తుల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీపారాధన చేస్తారు. కొంతమంది ఒక వత్తి, మరికొందరు రెండు వత్తులు, ఇంకొందరు మూడు వత్తులు వెలిగించాలని అంటుంటారు. మరి శుభకార్యాల్లో ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలో ఓ సారి చూద్దాం..!!
ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఈ సమయంలో దీపారాధనలో రెండు వత్తులను వేసి వెలిగించాలి.. ఎందుకంటే ఇందులో ఒకటి జీవాత్మ.. రెండోది పరమాత్మా.. కాబట్టి దీపారాధన చేసే సమయంలో తప్పనిసరిగా రెండు వత్తులను వేసి పూజ చేయాలని పండితులు అంటున్నారు.అయితే చనిపోయిన వారి తల దగ్గర మాత్రం ఒక వత్తి వేసి దీపం వెలిగించాలి. ఎందుకంటే జీవుడు పరమాత్మలో కలిసిపోయాడు అందుకే ఒక వత్తిని వెలిగిస్తారు. అలాగే దీపారాధన సూర్యునికి ప్రతీక. దీన్ని వెలిగించడం వల్ల ఇంట్లో దోషాల నుండి విముక్తి కలుగుతుంది. మనం ప్రతిరోజూ దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇది వీలుకానివారు కార్తీక పౌర్ణమి రోజు ఒకేసారి 365 వత్తులు వేసి దీపారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
Advertisement
ALSO READ :
Advertisement
భళా తంధాననా ఓటీటీ రైట్స్, రిలీజ్ డేట్, సాటిలైట్ రైట్స్
చిరంజీవిపై మండి పడుతున్న బయ్యర్లు.. మమ్మల్ని చావమంటావా అంటూ ఆయన ఇంటి