వేసవి కాలం వచ్చిందంటే చిన్నవారు,పెద్దవారు తాటి ముంజలను ఎంతో ఇష్టంగా తింటారు. తాటి ముంజలు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పోషకాలను అందిస్తాయి. వీటిని ఈ సీజన్లో మిస్సయితే మంచి పోషకాలను కోల్పోయినట్లే. ఈ వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల చదువుకునే పిల్లలకు బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అంతేకాదు తాటి ముంజలు మన శరీరానికి చలవ కలిగేలా చేశాయి.
Advertisement
వేసవికాలంలో తాటి ముంజలు తినడం వల్ల మన శరీరం కోల్పోయిన నీటిని, అలసట నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి. తరచూ తాటి ముంజలు తింటుంటే వేడిచేయడం సమస్య నుండి బయట పడవచ్చు. తాటి ముంజల్లో తక్కువ మొత్తంలో కేలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి. వేసవికాలంలో ముఖం మీద వచ్చే వేడి కురుపులు, మొటిమలకు నివారణగా తాటి ముంజలను తింటే మంచి ఫలితం లభిస్తుంది.
Advertisement
తాటి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండి ఇవి తినడం వల్ల వేసవి కాలంలో వచ్చే డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుండి కూడా దూరం చేస్తాయి. అలాగే అధిక బరువును కూడా తగ్గిస్తాయి. తాటి ముంజలు తిన్నాక జాడీలో ఉన్న ఒక ఆవకాయ ముక్కను తినడం వల్ల ఎన్ని తాటి ముంజలు తిన్నా కడుపు నొప్పి ఉండదు. ఇలా చేస్తే తాటి ముంజలు సులువుగా జీర్ణమవుతాయి.
ALSO READ :
జనసేన మేనిఫెస్టోతో పెళ్లి ప్రతిక.. సోషల్ మీడియాలో వైరల్..!
మహేష్ సర్కారు వారి పాట ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..?