Home » జ‌న‌సేన మేనిఫెస్టోతో పెళ్లి ప్ర‌తిక‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

జ‌న‌సేన మేనిఫెస్టోతో పెళ్లి ప్ర‌తిక‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

by Anji
Ad

అభిమానుల కోసం ఏమి చేయ‌డానికైనా వెనుకాడ‌రు. త‌మ అభిమాన న‌టుడు, నాయ‌కుడు ఇలా ఎవ‌రైనా వారి కోసం ఏదైనా చేయాల‌ని వార్త‌ల్లో నిలుస్తుంటారు. వార్త‌ల్లో వారికి ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. ఒక్కొక్క‌రూ ఒక్కో విధంగా త‌మ అభిమానాన్ని తెలుపుతుంటారు.

Advertisement

ప్ర‌స్తుతం జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అటు రాజ‌కీయాల్లో, ఇటు సినిమాల్లో చాలా మంది అభిమానులున్నారు. ఈ త‌రుణంలోనే తూర్పుగోదావ‌రి జిల్లా కొవ్వూరుకు చెందిన కోటే హ‌రీష్ బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వం వ‌హిస్తున్న జ‌న‌సేన పార్టీపై వినూత‌న రీతిలో త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్ర‌స్తుతం హ‌రీష్ బాబు జ‌న‌సేన లీగ‌ల్ సెల్ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నాడు. ఈనెల 04న ఆయ‌న పెళ్లి చేసుకోనున్నాడు.

Advertisement

అయితే కోటే హ‌రీష్‌బాబు త‌న పెళ్లి ప‌త్రిక‌లో పై భాగంలో జ‌న‌సేన పార్టీ యొక్క మేనిఫెస్టోను, గుర్తు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోటోల‌ను ముద్రించాడు. శుభ‌లేఖ కింది భాగంలో పెళ్లి ముహుర్తం వివ‌రాలు పొందుప‌రిచాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే త‌న‌కు ప్రాణం అని.. ఆయ‌న సిద్ధాంతాలు త‌న‌కు ప్రేర‌ణ కలిగించాయ‌ని హ‌రీష్ బాబు తెలిపాడు. మేనిఫెస్టోతో ముద్రించిన శుభేలేఖ జ‌న‌సేన అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ పెళ్లి ప‌త్రిక సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read : 

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ పై హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు.. దీనిపై హీరో ఏమ‌న్నాడంటే..?

మ‌హేష్‌ స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading