Home » చిరంజీవి గురించి ఆ విష‌యం బ‌య‌ట‌పెట్టిన సుమ‌న్‌..ఏమ‌న్నారంటే..?

చిరంజీవి గురించి ఆ విష‌యం బ‌య‌ట‌పెట్టిన సుమ‌న్‌..ఏమ‌న్నారంటే..?

by Anji

టాలీవుడ్ లో ఒక‌ప్పుడు అగ్ర‌హీరోల్లో ఒక‌రిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు సుమ‌న్‌. అత‌ని గురించి ఇంకా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న‌కు వెనుక నుండి ఎలాంటి స‌పోర్టు లేకుండానే సొంతంగా క‌ష్ట‌ప‌డి ఎదిగాడు. మెల్ల‌మెల్ల‌గా సినిమా అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ అగ్ర హీరోగా రాణించారు. ముఖ్యంగా 1980, 1990 ద‌శ‌కాల్లో చిరంజీవిధీటుగా రాణించారు. వీరిద్ద‌రి మ‌ధ్య వైర‌ముంద‌ని కూడా అప్ప‌ట్లో వార్తలు వినిపించాయి. ఇప్ప‌టికీ కూడా అప్పుడ‌ప్పుడు ఈ వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ మ‌ధ్య సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌, శోభ‌న్‌బాబు, కృష్ణ‌, కృష్ణంరాజు వంటి సీనియ‌ర్ హీరోల త‌రువాత నెక్ట్స్ బ్యాచ్ హీరోల్లో చిరంజీవి, నేను అని చెప్పారు. మా త‌రువాత ఇండ‌స్ట్రీకి వెంక‌టేష్‌, నాగార్జున వంటి హీరోలు వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించారు.


అప్ప‌ట్లో ఎక్కువ‌గా పోటీ త‌న‌కు, చిరంజీవికి మ‌ధ్య‌నే ఉండేద‌ని.. ఎవ‌రికీ వారికి ప్ర‌త్యేక‌మైన కంపౌండ్ ఉండేద‌ని.. రెండు గ్రూప్స్ ఉండేవ‌ని చెప్పారు. మా మ‌ధ్య మాత్రం ఎలాంటి గొడ‌వ‌లు లేవు. త‌మ మ‌ధ్య హెల్దీ కాంపిటేష‌న్ ఉండేద‌న్నారు. తాజాగా సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. క‌మ‌ల్‌హాస‌న్ గారు అంటే చాలా ఇష్టం. డాన్స్ విష‌యానికొస్తే చిరంజీవి డాన్స్ న‌చ్చుతుంద‌న్నారు.చిరంజీవి నేల చూడ‌కుండా డాన్స్ చేస్తారు.


డాన్స్ చేసేట‌ప్పుడు ఆయ‌న బాడీలో ఒక రిథముంటుంది. ఓ గ్రేస్ ఉంటుంది. చాలా మంది కుర్రాళ్లు ఇప్పుడు అంత‌కంట‌0ఏ ఫాస్ట్‌గా చేస్తున్నారు. అయితే వాటిలో జిమ్నాస్టిక్స్ ఎక్కువ‌గా ఉంటున్నాయి. చిరంజీవి త‌రువాత అంత బాగా డాన్స్ చేసే హీరోగా ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని చెప్పుకొచ్చారు సుమ‌న్‌. యాక్ష‌న్ సినిమాల నుంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. ఇప్ప‌టి సీనియ‌ర్ హీరోల‌కు మాత్రం ఒక‌ప్పుడు ఆయ‌న గ‌ట్టి పోటీనిచ్చారు. ప్ర‌స్తుతం సుమ‌న్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వ‌స్తున్నారు.

Also Read : 

కేజీఎఫ్ లో జూనియర్ యష్ గా నటించింది ఎవరో తెలుసా…అతడి బ్యాగ్రౌండ్ ఇదే…!

స్కిన్ షో కు అందుకే దూరంగా ఉంటా..కీర్తీ సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Visitors Are Also Reading