Home » స్కిన్ షో కు అందుకే దూరంగా ఉంటా..కీర్తీ సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

స్కిన్ షో కు అందుకే దూరంగా ఉంటా..కీర్తీ సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

టాలీవుడ్ బ్యూటీ కీర్తిసురేష్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఐనా ఇష్టం నువ్వు అనే సినిమాతో కీర్తి సురేష్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది. కానీ ఈ సినిమాతో పెద్ద‌గా గుర్తింపు రాలేదు. రామ్ హీరోగా తెర‌కెక్కిన నేను శైల‌జ సినిమాతో కీర్తి సురేష్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమా త‌ర‌వాత కీర్తి సురేష్ వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంది. స్టార్ హీరోల సినిమాల‌లో ఛాన్స్ కొట్టేసింది. ఇక కీర్తిసురేష్ కు మంచి న‌టిగా గుర్తింపు తీసుకువ‌చ్చిన సినిమా మ‌హాన‌టి.

keerthy suresh

Advertisement

ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. నిజంగానే సావిత్రి మ‌ళ్లీ వ‌చ్చిందా అన్నంత చ‌క్క‌గా కీర్తి ఆమె పాత్రలో జీవించేసింది. ఇక ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు హీరోగా తెర‌కెక్కుతున్న స‌ర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తోంది. కాగా కీర్తి సురేష్ ముందు నుండి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

keerthy suresh

Advertisement

మ‌హాన‌టి సినిమా త‌ర‌వాత పూర్తిగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు త‌న పాత్ర‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రాల‌లోనే న‌టిస్తోంది. సోష‌ల్ మీడియాలో కూడా కీర్తి సురేష్ అంద‌చందాలు వ‌ల‌కబోయ‌డం లో మిగ‌తా హీరోయిన్ ల‌తో పోలిస్తే త‌క్కువే. అయితే తాజాగా గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మొద‌టి నుండి తాను న‌ట‌న‌పైనే దృష్టి పెట్టాన‌ని చెప్పుకొచ్చింది.

అదృష్టం కొద్దీ త‌న‌కు అలాంటి పాత్ర‌లే వ‌చ్చాయ‌ని చెప్పింది. తెర‌పై గ్లామ‌ర్ గా క‌నిపించే విష‌యంలో తాను కొన్ని ప‌రిమితులు పెట్టుకున్న‌ట్టు పేర్కొంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వాటిని అదిగ‌మించ‌లేన‌ని చెప్పింది. అందుకే గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పింది. త‌న ఆలోచ‌న విధానం త‌న న‌ట‌న న‌చ్చిన ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా చూస్తార‌ని దీమా వ్య‌క్తం చేసింది.

ALSO READ : రాజ‌మౌళి సినిమాను రిజెక్ట్ చేసి ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్న అర్చ‌న…ఏ సినిమా అంటే..!

Visitors Are Also Reading