Home » కేజీఎఫ్ లో జూనియర్ యష్ గా నటించింది ఎవరో తెలుసా…అతడి బ్యాగ్రౌండ్ ఇదే…!

కేజీఎఫ్ లో జూనియర్ యష్ గా నటించింది ఎవరో తెలుసా…అతడి బ్యాగ్రౌండ్ ఇదే…!

by AJAY
Published: Last Updated on
Ad

KGF2 Child Artist: ప్రశాంత్ నీల్ యష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ -2 ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా వ్యాప్తంగా కలెక్షన్ ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా లో హీరోగా నటించిన యష్ తో పాటు విలన్ పాత్రలో నటించిన సంజయ్ దత్ మరియు ఇతర తారాగణం నటన పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమాలో యష్ టీనేజ్ వయసులో ఉన్నప్పుడు అతడి ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా కీలకంగా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో నటించిన ఆర్టిస్ట్ ఎవరా అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ కుర్రాడు ఎవరు అతడి బ్యాగ్రౌండ్ ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం.

Advertisement

జూనియర్ యష్ అసలు పేరు అన్మోల్ విజయ్ బత్కల్ కాగా అతడి వయసు 18 ఏళ్లు….ప్రస్తుతం అన్మొల్ చదువు పై దృష్టి పెట్టాడు. అన్మోల్ కు నటించడం కంటే డ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమట. కానీ కేజీఎఫ్ లో మాత్రం నటన తో కూడా అబ్బురపరిచాడు. అంతే కాకుండా స్టంట్ లు చేయడం అన్నా కూడా అన్మోల్ కు చాలా ఇష్టమట. అందుకే అన్మోల్ సోషల్ మీడియాలో ఎక్కువగా డ్యాన్స్ వీడియోలు మరియు స్టంట్ లు చేసిన వీడియోలే కనిపిస్తుంటాయి.

 

ఇప్పుడే కాదు చిన్న తనం నుండే అన్మోల్ కు డ్యాన్స్ స్టంట్ లపై ఆసక్తి ఉండటం తో అతడు అందులో శిక్షణ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. కేజీఎఫ్ కంటే ముందు కూడా అన్మోల్ కొన్ని కన్నడ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అలరించాడు. కానీ కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ జూనియర్ యష్ జీవితంలో మరింత సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Also read :

స్కిన్ షో కు అందుకే దూరంగా ఉంటా..కీర్తీ సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

RGV నాగార్జునల శివ సినిమా స్టోరీ విని ఇండస్ట్రీలో ఏమనుకున్నారో తెలుసా ?

Visitors Are Also Reading