Home » తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..!

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..!

by Sravanthi Pandrala Pandrala

కరోనాతో గత రెండు సంవత్సరాలుగా సరిగ్గా పాఠశాలలు నడవక విద్యార్థుల చదువులు చాలా వెనకబడి పోయాయి. ఇప్పుడే కాస్త కరోనా తగ్గడంతో పాఠశాలలు ప్రారంభమై విజయవంతంగా అన్ని పరీక్షలు ముగించుకొని వేసవి సెలవులు కూడా ఇచ్చుకునే పరిస్థితికి వచ్చాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎండలు బాగా దంచి పడుతుండడంతో వాతావరణ శాఖ కూడా మధ్యాహ్న సమయంలో ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. మే 23 నుంచి 28 వరకు టెన్త్

క్లాస్ పరీక్షలు జరగనున్నాయి. అయితే 24వ తేదీ నుంచి పదవ తరగతి స్టూడెంట్స్ కు రివిజన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు రివిజన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే 24 నుంచి వేసవి సెలవులు కావడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్కూల్స్ తెరిస్తే

కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే మే ఆరు నుంచి 18 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉండగా, మే 7 నుంచి 19 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ;

ఒక్క సినిమాతో ఎన్టీఆర్, చిరంజీవి రికార్డులను బద్దలు కొట్టిన శ్రీకాంత్ మూవీ ఎదో తెలుసా ? ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు..!

IT Jobs: ఫ్రెష‌ర్స్‌కు శుభ‌వార్త‌.. సాల‌రీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు

 

Visitors Are Also Reading