దేశం ఏదైనా, జాతి ఏదైనా ఆడ మగ కలిసి జీవించడానికి పెళ్లి అనే విధానం మాత్రం అన్నిచోట్లా ఉంటుంది. పెళ్లి జరిగే పద్ధతుల్లో మాత్రం రకరకాల తేడాలు ఉంటాయి.ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఉండే వివాహ ఆచారాలు ఇప్పుడు తెలుసుకుందాం.. చైనాలో ఓ వింత ఆచారం వుంది.
Advertisement
పెళ్లికి నెలరోజుల ముందు నుంచి ఆ పెళ్ళికూతురు రోజుకు ఒక గంట చొప్పున తప్పకుండా ఏడవాల్సిందేనట. అంతే కాదు పది రోజుల తర్వాత ఆ నవవధువుకు తోడుగా వాళ్ళ అమ్మ కూడా ఆ ఏడుపులో పాలుపంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ళ అమ్మమ్మ తోడవుతుంది. నెల రోజుల్లో అమ్మాయి
కుటుంబ సభ్యుల్లో మహిళలంతా పెళ్లికూతురుకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట. ఫిజీ దేశంలో పెళ్ళికొడుకు అడిగే లాంఛనాలే వేరు. అక్కడి పెళ్ళికొడుకు పిల్లనిచ్చే మామను పిల్లతో పాటు తిమింగలం దంతాన్ని అడుగుతాడట. మరి ఆ దంతాన్ని ఇచ్చి పిల్లకు పెళ్లి చేయాలంటే పిల్ల తండ్రి ఆస్తి మొత్తం అమ్మడంతో పాటు దొంగతనాలు చేయక తప్పదు. స్వీడన్ దేశంలో ఒక వింత ఆచారం వుంది. వివాహ రిసెప్షన్ లో
Advertisement
నవదంపతులు కూర్చున్నచోట నుంచి పక్కకు వెళితే చాలు వారిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చట. అమ్మాయో లేక అబ్బాయో వారి కుర్చీ నుంచి లేచి బాత్రూంకి వెళ్లి నా సరే అమ్మాయినయితే పురుషులు, అబ్బాయినయితే మహిళలు నిరభ్యంతరంగా ముద్దు పెట్టుకోవచ్చట. పెళ్లయ్యాక మొదటి రాత్రి తంతులో కొత్త దంపతులకు తోడుగా ఓ పెద్దావిడను బెడ్ రూమ్ లోకి పంపుతారట. ఈ వింత ఆచారం ఆఫ్రికా లోని కొన్ని పల్లెటూర్లలో ఉంది. ఆ పెద్దావిడ పెళ్లికూతురు తల్లి అయినా కావచ్చట. కాంగోలో పెళ్లి ఆచారం వెరైటీ గా ఉంటుంది. పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట.
ఇవి కూడా చూడండి :
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటున్న వంటలక్క.. కండిషన్స్ ఏమిటంటే..!!
Samantha & Naga chaitanya: నాగచైతన్య రెండో పెళ్లిపై.. అక్కినేని ఫ్యామిలీ ఏమంటుందంటే..!!
SAMANTHA : ఎంత విడిపోతే మాత్రం ఇలా చేయాలా ? సమంతా ? పాపం చైతు !