Home » Samantha & Naga chaitanya: నాగచైతన్య రెండో పెళ్లిపై.. అక్కినేని ఫ్యామిలీ ఏమంటుందంటే..!!

Samantha & Naga chaitanya: నాగచైతన్య రెండో పెళ్లిపై.. అక్కినేని ఫ్యామిలీ ఏమంటుందంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అక్కినేని కోడలు సమంత అక్కినేని నాగ చైతన్యతో విడిపోవడం మనందరికీ తెలిసిన విషయమే. వారిద్దరూ మనస్ఫూర్తిగా డివోర్స్ తీసుకున్న తర్వాత ఎవరికి వారే సింగిల్ గా ఉంటున్నారు. కొద్ది రోజులు ఇబ్బంది పడ్డ సమంత తర్వాత సినిమాలతో చాలా బిజీగా మారిపోయి తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వస్తోంది. ఈ విధంగానే నాగచైతన్య కూడా డివోర్స్ విషయాన్ని కానీ విడిపోయిన విషయాన్ని కాని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా షూటింగ్ లతో చాలా బిజీ అయిపోయారు. ఈ విధంగా ఇద్దరు ఎవరి పనుల్లో వారు ఉండగా సోషల్ మీడియాలో మాత్రం ఓ టాక్ చక్కర్లు కొడుతోంది.

Advertisement

అక్కినేని నాగచైతన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారని విపరీతంగా వైరల్ అవుతోంది. అది కూడా తమన్నాని వివాహం చేసుకోబోతున్నట్టు ఏవో న్యూస్ లో గత రెండు రోజులుగా తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని బాగా పరిశీలించి చూస్తే అదంతా అబద్ధమని తేలుతోంది. అక్కినేని ఫ్యామిలీ ఏమంటుందంటే నాగచైతన్య రెండో పెళ్లి పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధమని, నాగచైతన్య ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదంటూ, నాగార్జున చైతు కోసం ఏ అమ్మాయిని

Advertisement

కూడా తీసుకు రాలేదని చెబుతున్నారు. మరి చైతు తన పని తానే చేసుకుంటూ పోయినా కానీ ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో.. అటు సమంత మాత్రం వర్కౌట్ వీడియోస్ తో మరో పక్క బిజీ షెడ్యూల్ షూటింగ్ తో చాలా బిజీగా మారిపోయింది. ఈ తరుణంలోనే నాగచైతన్య పెళ్లి విషయం సోషల్ మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు కొడుతూ అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

ఇక్కడ కూడా చదవండి :

SAMANTHA : ఎంత విడిపోతే మాత్రం ఇలా చేయాలా ? సమంతా ? పాపం చైతు !

నడుం పై చై, వీపు పై వైఎంసీ…తన తరవాత టాటూ పై సమంత షాకింగ్ కామెంట్స్!

డీజే టిల్లు పాటకు లయ స్టెప్పులు….వీడియో వైరల్…!

 

Visitors Are Also Reading