టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పట్లో టాలీవుడ్ లోని పలువురు నటీనటులు దర్శకులు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని విచారణ చేపట్టింది. కానీ విచారణ అనంతరం అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. అయితే సెలబ్రెటీలు మినహా డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తితో పాటూ మరికొందరు ఇప్పటికీ ఈ కేసులో విచారణ ఎదురుకుంటున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లోని రాడిసన్ పబ్ లో అర్దరాత్రి దాటిన తరవాత కూడా రేవ్ పార్టీ కొనసాగుతూ ఉండటంతో అధికారులు దాడులు నిర్వహించారు.
Advertisement
ఈ పబ్ లో మొత్తం 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లను కూడా పోలీసులు బయటపెట్టారు. వీరిలో రాహుల్ సిప్లింగజ్ సహా మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు ఉన్నాయి. మెగాడాటర్ నిహారిక పేరు పోలీసుల రికార్డులో లేకపోయినా నిహారిక సైతం పోలీసు స్టేషన్ లో దర్శనం ఇచ్చింది. దాంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
Advertisement
ఇక మీడియాలో నిహారిక, రాహుల్ సిప్లింగజ్ పేర్లు మారుమోగిపోయాయి. దాంతో రాహుల్ సిప్లింగజ్ వెంటనే మీడియా ముందుకు వచ్చి తాను డ్రగ్స్ తీసుకోలేదని ఎలాంటి టెస్టులకు అయినా రెడీ అని చెప్పారు. తాను గతంలో డ్రగ్స్ అవేర్నెస్ కోసం పనిచేశానని అన్నారు. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
పోలీసులు టెస్టులు చేసి పేర్లను బయటపెట్టాలని వ్యాఖ్యానించింది. అయితే నిహారిక పేరు వైరల్ అవ్వడంతో నాగబాబు కూడా ఓ వీడియో బైట్ ను వదిలారు. నిహారిక ఈ విషయంలో క్లియర్ గా ఉందని చెప్పారు. ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. అయితే ఇక్కడే బెడసికొట్టింది. హారిక మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిందని కానీ నాగబాబు ఎందుకు వచ్చారని నిహారిక ఒక తప్పు చేస్తే నాగబాబు మరో తప్పు చేశారని అంటున్నారు.