Home » ‘శుభ‌కృత్’ నామం శోభ‌య‌మానంగా త‌ర‌లివ‌చ్చెనా..?

‘శుభ‌కృత్’ నామం శోభ‌య‌మానంగా త‌ర‌లివ‌చ్చెనా..?

by Anji
Ad

2019-20 వికారి నామ సంవ‌త్స‌రంలో 2019 డిసెంబ‌ర్ ప్ర‌పంచ అంతా ప్ర‌శాంతంగానే ఉంది. ఎప్పుడైతే డిసెంబ‌ర్ నెల ప్రారంభ‌మైందో అప్పుడే ఈ వికారి నామ సంవ‌త్స‌రంలో తొలుత చైనాలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపించింది. అలా కాల క్ర‌మేణా ప్ర‌పంచం మొత్తం విజృంభించి ఎంతో మంది ప్రాణాల‌ను బ‌లికొన్న‌ది. వికారి నామ సంవత్స‌రంలోనే క‌రోనా రావ‌డం విశేషం.


2020-21 శార్వ‌రీ నామ సంవ‌త్స‌రంలో లాక్ డౌన్ ప్రారంభం అయింది. వికారి నామ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన క‌రోనా మ‌హ‌మ్మారీ ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభించ‌డంతో ఆ స‌మ‌యంలో చాలా దేశాల్లో లాక్‌డౌన్ నిర్వ‌హించారు. కొన్ని సంద‌ర్భాల్లో క‌రోనా మ‌హ‌మ్మారీ మూలంగా చీక‌టిలోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా భార‌త్‌లో అంధ‌కారం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌ధాని మోడీ మార్చి 22, 2020 న జ‌న‌తా క‌ర్ప్యూ పాటించి క‌రోనాపై యుద్ధం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రూ చేయి చేయి క‌లపాల‌ని పిలుపునిచ్చారు. అదేవిధంగా 2020 ఏప్రిల్ నెల‌లో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో వెలుతురు ఉండాల‌ని మోడీ పిలుపునివ్వ‌డంతో. . అంధ‌కారం నుంచి వెలుతురులోకి వ‌చ్చిన‌ట్టు అవుతుంద‌ని దేశ‌వ్యాప్తంగా మోడీ పిలుపు మేర‌కు వెలుతురు ప్ర‌కాశింప‌జేశారు.

Advertisement

Advertisement

2021-22 ప్ల‌వనామ సంవ‌త్సరంలో క‌రోనా మ‌మ‌హ్మారీ కాస్త త‌గ్గింది. త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ర‌ల ఒమిక్రాన్ రూపంలో విజృంభించింది. కొంత మంది ప్రాణాలను పొట్ట‌న పెట్టుకుంది. ఎట్ట‌కేల‌కు క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా భార‌త్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగంగా దూసుకెళ్లుతుంది.


2022-23 శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రంలో ముఖ్యంగా అన్ని శుభాలు క‌లుగుతాయని ఇప్ప‌టికే ప‌లువురు పండితులు పేర్కొంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ క‌రోనా మ‌హ‌మ్మారీని త‌రిలికొట్టేందుకు టీకాల‌తో పాటు మెడిసిన్ కూడా త‌యారు చేస్తున్న‌ట్టు ప‌లువురు శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఈ సంవ‌త్సంలో క‌రోనాకు మందు క‌నుక్కుంటే శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రంలో శుభం క‌లిగిన‌ట్టే.. శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం శుభం క‌లిగిస్తుందా..? లేక అశుభం క‌లిగిస్తుందా అనేది మాత్రం తెలియాలంటే కొన్ని నెల‌లు గ‌డ‌వాల్సిందే.

Also Read  :  ఆక‌ట్టుకుంటున్న విజ‌య్ బీస్ట్ ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading