సాధారణంగా హీరోలు ఇండస్ట్రీకి చెందిన వాళ్లను తక్కువగా పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతమంది హీరోలు సినిమా షూటింగ్ సమయంలో తమ హీరోయిన్ తో ప్రేమలో పడి ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటారు. బయటివాళ్లను పెళ్లి చేసుకుంటే కామనే గానీ ఇండస్ట్రీకి చెందినవాళ్లనే పెళ్లి చేసుకుంటే మాత్రం అటు హీరోయిన్ అభిమానులు ఇటు హీరో అభిమానులు కూడా కుషీ అవుతారు.
Advertisement
ఆ మ్యారేజ్ కోసం కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరో ఆదిపినిశెట్టి కూడా హీరోయిన్ నిక్కి గల్రానీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరిద్దరూ కలిసి శమంతకమని అనే సినిమాలో నటించారు.
Advertisement
ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో కొంతకాలం డేటింగ్ లో ఉన్న ఈ జంట తాజాగా మార్చి 24 నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు ఈ నిశ్చితార్థానికి హాజరైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆది పినిశెట్టి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
రెండేళ్ల క్రితం తాము కలుసుకున్నామని ఇప్పుడు ఒక్కటికాబోతున్నామని ఆది పేర్కొన్నారు. జీవితంలో ఒకరికొకరు తోడుండటం అత్యత్తమమైనదని అని ఆది పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆదిపినిశెట్టి నిక్కి గల్రానీ ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.