మనదేశంలో కుటుంబ బరువు బాధ్యతలు మోసేది తండ్రి. భారత్ పిత్రుసౌమ్య వ్యవస్థ గా నడుస్తోంది. కాబట్టి కుటుంబ పెద్ద సరైన దారిలో నడిచి కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించాల్సి ఉంటుంది. కుటుంబ పెద్ద సక్రమంగా లేకపోతే ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే ఆచార్య చాణక్యుడు ఇంటి పెద్ద ఎలా ఉండాలి …ఎలా నడుచుకోవాలో కొన్ని సలహాలు …సూచనలు చేశారు. ఇంటి పెద్ద ఎప్పుడూ సరైన మార్గంలో నడవాలని ఆచర్య చాణక్యుడు తెలిపాడు. మొదట ఇంటి పెద్దనే పిల్లలు అనుకరిస్తారు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలని చాణక్యుడు తెలిపాడు. సోదరి సోదరులతో కుటుంబ పెద్ద మంచి సంబంధాలను కలిగి ఉండాలని చాణక్యుడు వెల్లడించాడు.
Advertisement
సరదాగా ఉండటం : ఇంటికి తానే పెద్ద అయినప్పటికీ ప్రతి సందర్భం లోనూ కుటుంబ సభ్యులను భయపెట్టకుండా వారితో సరదాగా ఉండాలని చెప్పాడు. అలాంటప్పుడే ఇంట్లోని సమస్యలు కుటుంబ సభ్యులు చెప్పుకోగలరు అని తెలిపాడు.
Advertisement
ఆహారం వృధా చేయవద్దు : ప్రతి విషయం పిల్లలు మొదట పెద్దల నుండే నేర్చుకుంటారు. కాబట్టి పెద్దలు ఆహారాన్ని వృధా చేయవద్దు. అలా చేయడం వల్ల పిల్లలకు డబ్బు విలువ ఆహారం విలువ తెలియకుండా తయారు అవుతారు.
డబ్బు వృధా చేయడం : పెద్దలు డబ్బులను వృధా చేయకూడదు అని చాణక్యుడు పేర్కొన్నాడు. అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చి కుటుంబం కష్టాల పాలు అవుతుందని తెలిపాడు. డబ్బును పొదుపు చేస్తే కష్ట సమయాల్లో బయటపడవచ్చు అని చాణక్యుడు వెల్లడించాడు.