Home » హోలికి వింత ఆచారం…అక్కడ కొత్త అల్లుడు గాడిద ఎక్కాల్సిందే…!

హోలికి వింత ఆచారం…అక్కడ కొత్త అల్లుడు గాడిద ఎక్కాల్సిందే…!

by AJAY

భారతీయ పండుగలు ఎంతో ప్రత్యేకమైనవి. మన దేశంలో మిగితా దేశాల కంటే ఎక్కువ సంఖ్యలో పండగలు జరుపుకుంటారు. అంతే కాకుండా ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరోవైపు ఓకే పండగ ను ఒక్కో ప్రాంతం లో ఒక్కో రకంగా కూడా జరుపుకుంటారు. ఇక భారత్ లో జరుపుకునే పండగల్లో హోలీ పండగ కూడా ఎంతో ముఖ్యమైనది. రంగులు చల్లు కుంటూ ఈ పండగను జరుపుకుంటారు.

అయితే మహారాష్ట్ర లోని ఓ గ్రామంలో రంగులు చల్లుకోవడం తో పాటు వింత ఆచారం కూడా ఉంది. ఆ ఊరిలోకి వచ్చిన కొత్త అల్లుళ్లను గాడిద పై ఎక్కించి ఊరేగిస్తారు. ఆ తరవాత అతడు కోరిన కొత్త బట్టలను పెడతారు. ఈ వింత ఆచారం మహారాష్ట్రాలోని బిడ్ జిల్లా విదా గ్రామంలో 90 ఏళ్ల నుండి పాటిస్తున్నారు. ఇక్కడ హోలీ పండగ రాగానే ఎవరెవరి ఇంట్లో కొత్త అల్లుళ్లు ఉన్నారో సర్వే చేసి మరీ గాడిద పై ఎక్కిస్తారు. అంతే కాకుండా అల్లుళ్లు తప్పించు కాకుండా నిఘా కూడా పెడుతుంటారు.

Visitors Are Also Reading