టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలలో హలో బ్రదర్ సినిమా కూడా ఒకటి. అప్పట్లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ నటించిన ఈ ప్రయోగానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
Advertisement
ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించగా… సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించింది. నాగార్జున సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.
హీరోలు ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఎన్నో ఉన్నా కూడా ఈ సినిమాలో మాత్రం ఇద్దరు ట్విన్స్ ఓకే సమయంలో ఒకే పనిని చేయడం అనే కాన్సెప్ట్ కొత్తగా కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా రమ్యకృష్ణ కూడా నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున కు సినిమా పై ఎలాంటి అంచనాలు లేవట. అంతేకాకుండా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ముందే ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం లేదు అంటూ కామెంట్ చేసేవారట.
Advertisement
కానీ నాగార్జున అంచనాలను ఈ సినిమా తలకిందులు చేస్తూ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తోనే నాగార్జున మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున హలో బ్రదర్ సినిమా కు మరియు ఎన్టీఆర్ హీరోగా నటించిన అగ్గిపిడుగు సినిమాకు కూడా ఒక సంబంధం ఉంది. అగ్గి పిడుగు సినిమాలో కూడా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. అగ్గి పిడుగు సినిమా లో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉంటారు.
Also read : సీనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ చేసిన 5 సినిమాలు ఇవే..!
అయితే ఈ సినిమాను ప్రేరణగా తీసుకునే ఇవివి. సత్యనారాయణ కథలు రాసుకున్నారని అప్పట్లో టాక్ కూడా ఉంది. అంతే కాకుండా జాకీచాన్ ద్విపాత్రాభినయం చేసిన ట్విన్స్ అనే సినిమాను కూడా దర్శకుడు ప్రేరణగా తీసుకుని హలో బ్రదర్ కథను రాసుకున్నారని కూడా టాక్ ఉంది. 1964 సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన అగ్గిపిడుగు సినిమా విడుదల కాగా….. ఈ సినిమా తొలి వారంలోనే ఐదులక్షల కలెక్షన్లు రాబట్టి అప్పట్లో సంచలనం సృష్టించింది.