అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్ ఉండాలన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన అని వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని గడ్డిఅన్నారంలో ఉన్న పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామానికి తరలించి అత్యాధునికంగా మార్కెట్ ను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా కొహెడలో రూపుదిద్దుకుంటుందని, త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.
Also Read : బిల్ గేట్స్ కు ‘హిలాల్ ఎ పాకిస్తాన్’ అవార్డుతో సత్కారం
Advertisement
కొహెడలో నూతన మార్కెట్ ప్రాంగణంలో రూ.50లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కొహెడలో ఉద్యాన రైతులు, విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం తాత్కాలికంగా కొనసాగుతున్న బాటసింగారం పండ్ల మార్కెట్‌ను పరిశీలించారు. కొహెడ మార్కెట్ నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. దాదాపు 178 ఎకరాల్లో కొహెడ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
Advertisement
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ కన్నా చాలా పెద్ద మార్కెట్‌ను కొహెడలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంత్రి వివరించారు. కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి. గతంలో కూరగాయలు తక్కువ.. అన్నం, రొట్టెలు ఎక్కువ తింటే.. ఇప్పుడూ కూరలు పండ్లు ఎక్కువగా తింటున్నారు అని పేర్కొన్నారు. మానవుల అవసరాలకనుగుణంగా ఉద్యానపంటల సాగు పెరుగుతుందని చెప్పారు. ఉద్యాన పంటల సాగుకు అనుగుణంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులున్నాయని స్పష్టం చేసారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఔటర్ రింగ్ రోడ్డుకు, రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండడంతో కొహెడ మార్కెట్‌కు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు.
Also Read : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సైమన్ కటీచ్ వీడ్కోలు..!