Home » ఫిట్స్ వచ్చిన వాళ్లకు తాళం చెవి పెడితే తగ్గుతుందా…? ఆ టైం లో కూల్ డ్రింక్ తాగితే ఏం జరుగుతుంది…?

ఫిట్స్ వచ్చిన వాళ్లకు తాళం చెవి పెడితే తగ్గుతుందా…? ఆ టైం లో కూల్ డ్రింక్ తాగితే ఏం జరుగుతుంది…?

by Venkatesh

మూడ నమ్మకాలకు మన దేశంలో ఉండే విలువ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అనవసర విషయాలను ఒక రేంజ్ లో నమ్మి, నమ్మిస్తూ ఉంటారు. అందులో ఒకటి ఫిట్స్ వచ్చినప్పుడు తాళం గుత్తి చేతిలో పెడుతూ ఉంటారు. దానితో నిజంగా ఫిట్స్ ఆగుతాయా అంటే… కచ్చితంగా ఆగే ఛాన్స్ లేదు.

ఇది కేవలం ఒక మూఢనమ్మకమేనని వైద్యులు ఎన్ని సార్లు చెప్పినా… మనం నమ్మకం ముందు సైన్స్ వేస్ట్ కదా. ఎపిలెప్సీ (ఫిట్స్) వచ్చినపుడు కొన్ని నిమిషాలపాటు మాత్రమే ఉండి ఆ తర్వాత అది తగ్గిపోవడం జరుగుతుంది. కాకుండా ఎక్కువ సేపు వస్తే మాత్రం వైద్యం సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్య ఉన్న వ్యక్తులను కొన్ని కొన్ని వస్తువులకు దూరంగా ఉంచాలి. ప్రమాదకరమైన వస్తువులకు వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.Why are metal keys placed in a patient who suffering from a seizure  episode? - Quora

వారి బట్టలు బిగుతుగా ఉంటే కొంచెం వదులు చేసి బాగా గాలి ఆడే విధంగా చూసుకోవాలి. వారిని గట్టిగా అదిమి పెట్టె ప్రయత్నం చేయవద్దు. పళ్ళు కటకటలాడుతుంటే వాటి మధ్యలో ఏదీ ఉంచవద్దు. దానివల్ల పళ్ళు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వారిచేత బలవంతంగా ఏదైనా కూల్ డ్రింక్స్ లాంటివి తాగించే ప్రయత్నం చేస్తే ఊపిరి ఆడాడు. అవి ఊపిరి తిత్తులకు చేరి ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు. మీకు ఏమీ తెలియకపోతే సైలెంట్ గా ఉండండి గాని పిచ్చి పని చేయవద్దు.

Visitors Are Also Reading