Home » ‘శేఖర్‌’ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

‘శేఖర్‌’ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

by Anji
Ad

గ‌రుడ వేగ‌, క‌ల్కి సినిమాల త‌రువాత రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం శేఖ‌ర్. రాజ‌శేఖ‌ర్ స‌తీమ‌ణి జీవిత రాజ‌శేఖ‌ర్ చాలా ఏళ్ల త‌రువాత మ‌రొక‌సారి మెగా ఫోన్ ప‌ట్టి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఆత్మీయ రాజ‌న్‌, ముస్కాన్, క‌న్న‌డ కిషోర్‌, స‌మీర్‌, భ‌ర‌ణి, ర‌వి వ‌ర్మ వంటి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. బీరం సుధాక‌ర్‌రెడ్డి, శివాని రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, బొగ్గారం వెంక‌ట శ్రీ‌నివాస్‌, సంయుక్త భాగ‌స్వామ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత సార‌త్యం వ‌హిస్తున్నారు. ఇది రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న 91వ చిత్రం పైగా జీవితా రాజ‌శేఖ‌ర్ చాలా కాలం త‌రువాత ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షించ‌డంత సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. తాజాగా రాజ‌శేఖ‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా శేఖ‌ర్ సినిమాలోని కిన్నెర సాంగ్‌ను మూవీ మేక‌ర్స్‌ విడుద‌ల చేశారు.

Advertisement

Advertisement

ఇదే వేదిక‌పై రాజ‌శేఖ‌ర్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోను అయ్యారు. క‌రోనా స‌మ‌యంలో నేను బ‌తుకుతానా లేదా అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింద‌ని మ‌ళ్లీ కెమెరా ముందుకు లేవ‌లేక‌పోయాను. అయితే ఈరోజు ఇలా మీ ముందు ఉన్నానంటే.. అది మీ అంద‌రి ఆశీర్వాద బ‌ల‌మే అని మీ ప్రేమాభిమానులు న‌న్ను క‌రోనా నుంచి జ‌యించే విధంగా చేశాయి.

క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత శేఖ‌ర్ సినిమాను చేసాను. 10 సినిమాలు చేసేందుకు ఎంత క‌ష్ట‌ప‌డ్డానో ఈ ఒక్క సినిమా కోసం అంత క‌ష్ట‌ప‌డ్డాను. యూనిట్ అంతా ప్రాణం పెట్టి ఈ సినిమాకు ప‌ని చేశాం. ఇక ఈ చిత్రం ఇంత బాగా రావ‌డానికి కార‌ణం జీవిత‌. త‌ను మా వెనుకుండి న‌డిపించింది. దాని ఫ‌లితం ఈ సినిమాలో క‌నిపిస్తుంది. మీరంద‌రూ ఈ సినిమాను చూసి మ‌మ్మ‌ల్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అనంత‌రం ద‌ర్శ‌కురాలు జీవిత రాజ‌శేఖ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ రాజ‌శేఖ‌ర్ కూతురు న‌టి శివానితో పాటుప‌లువురు ప్ర‌ముఖులు మాట్లాడారు. సినిమాను ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరారు.

Also Read : అల్లు అర్జున్ హుక్ స్టెప్ ను రీక్రియేట్ చేసిన చిన్నారి వీడియో వైర‌ల్

Visitors Are Also Reading