మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తానకు కరోనా పాజిటవ్ వచ్చిందని మెగాస్టార్ వెల్లడించారు. స్పల్పలక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని మెగాస్టార్ పేర్కొన్నారు. ఇక కరోనా కారణంగా ప్రతి యేటా తన తల్లి పుట్టినరోజును ఎంతో గనంగా నిర్వహించే చిరు ఈ యేడాది పుట్టిన రోజు వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు.
దాంతో సోషల్ మీడియా ద్వారానే చిరు తన తల్లి అంజనాదేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగాస్టార్ లో కేవలం నటుడు మాత్రమే కాకుండా ఓ చెఫ్ కూడా ఉన్నారని గత లాక్ డౌన్ వేళ బయటపెట్టారు. ఇంట్లో దోశలు వేస్తూ..కేఎఫ్ సీ చికెన్ చేస్తూ వంటింట్లో సందడి చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తాజాగా మెగాస్టార్ తనలో మంచి ఫోటో గ్రాఫర్ మరియు కవి కూడా ఉన్నాడని బయటపెట్టారు. ఐసోలేషన్ లో ఉన్న చిరంజీవి తన గది నుండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి ఫోటోను సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు.
Advertisement
అంతే కాకుండా ఆ ఫోటోలను షేర్ చేసి దానికి “ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో వున్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా వుంది.” అంటూ కవిత్వాన్ని జోడించారు.