AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈసారి పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు జరగడం కచ్చితంగా కనబడుతోంది. ఏకంగా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రిల తనయులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎం తనయులు ఉన్నారు ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి.
Advertisement
ఎన్టీఆర్ మూడుసార్లు, చంద్రబాబు నాయుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు చొప్పున ఉమ్మడి ఏపీ సీఎంలుగా పని చేయడం జరిగింది. ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నారు బిజెపి అధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడం ఖాయంగా కనబడుతోంది.
చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుండి అసెంబ్లీ బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణ చేతిలో ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసులైనటు వంటి జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోసారి పులివెందుల నుండి పోటీ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి కడప పార్లమెంట్ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు చూస్తున్నారు.
Advertisement
Also read:
- Om Bheem Bush Review: ఓం భీమ్ బుష్ కథ, రివ్యూ అండ్ రేటింగ్..!
- ఉదయ్ కిరణ్తో చిరంజీవి తన కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?
- HanuMan Total Collections: హనుమాన్ సినిమాకి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా..?
మొట్టమొదటిసారి షర్మిల రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మాజీ కేంద్రమంత్రి కోట్ల జై సూర్య ప్రకాష్ రెడ్డి డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు ఉమ్మడి ఏపీకి రెండుసార్లు కాంగ్రెస్ తరపున సీఎం గా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకే జయప్రకాష్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కొడుకు నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నుండి జనసేన తరపు నుండి బరిలోకి దిగారు ఇలా ఈసారి మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎం తనయులు ఉన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!