అదృష్టం అంటే ఎప్పుడు ఏవిధంగా ఉంటుందో.. వస్తుందో అసలు ఊహించలేము. కొన్నిసార్లు అనుకోకుండా వర్తిస్తుంటుంది. కొన్నిసార్లు అదృష్టంతో పాటు దురదృష్టం కూడా వస్తుంటుంది. అయితే తాజాగా టకా టకా మని బాదినప్పుడే తలుపు తీయాలి. ఓ మహిళా అలాగే చేసింది కాబట్టే కాసుల వర్షం కురిసింది. జంట్ షాపులో కొనన పాత కుర్చి ఆమె జీవితాన్నే మార్చేచింది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఈస్ట్ సస్పెక్స్ బ్రిగ్‌టన్‌కు చెందిన ఓ మహిళ పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఆ మధ్య ఓ కుర్చీ కొనుగోలు చేసింది. దాని ధర 5 ఫౌండ్లు. అనగా భారత కరెన్సీలో రూ.500ల వరకు. అప్పుడు దాని విలువ ఆమెకు తెలియదు. పాత సామాన్లపై ఆసక్తి ఉన్న ఓ దగ్గరి బందువు కుర్చి మీద వేసిన డేట్ చూశాడు. స్టడీ చేసి దాని గొప్పతనం గురించి చెప్పడంతో ఆమె దానిని వేలం పాటకు తీసుకెళ్లింది. వేలంలో ఆమెకు 16,250 ఫౌండ్లు వచ్చాయి. భారత కరెన్సీలో దాదాపు 16,40,000పైగానే డబ్బులు వచ్చాయి.
Advertisement
కుర్చి 20 శతాబ్దంలో వియన్నా ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కు చెందింది అట. ఆస్ట్రియన్ పెయింటర్ కోల్‌మన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడు. కోల్‌మన్ సంప్రదాయ శైలీను వ్యతిరేకిస్తూ.. మోడ్రన్ ఆర్ట్ వర్క్ ద్వారా ఆస్ట్రియాలో పేరు సంపాదించుకున్నారు. నిచ్చెన తరహా స్టైల్ లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీని రూపొందించారు ఆయన.
ఇదంతా తెలిసిన తరువాత మహిళ పాత కుర్చితో ఎస్పెక్స్‌లోని స్వోడర్స్ యాక్షనీర్స్ ఆఫ్ మౌంట్‌పిట్నేట్ వాళ్లను సంప్రదించింది. వాళ్లు దానిని వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 ఫౌండ్లు చెల్లించి దక్కించుకున్నాడు. 120 ఏండ్లు గడుస్తున్నా కుర్చీ ఇంకా ఒరిజినల్ కండీషన్‌లోనే ఉండడం గొప్ప విశేషం.