Home » Nara Lokesh: రాష్ట్రం కోసం భూములని త్యాగం చేసిన అన్నదాతలకు న్యాయం జరుగుతుంది..!

Nara Lokesh: రాష్ట్రం కోసం భూములని త్యాగం చేసిన అన్నదాతలకు న్యాయం జరుగుతుంది..!

by Sravya
Ad

నారా లోకేష్ చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందని నారా లోకేష్ అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందని అన్నారు నారా లోకేష్.  అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలని కోల్పోయిన వారికి ఆయన నివాళులు అర్పించారు. అమరావతి పరిరక్షణ కి రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజుల పూర్తయింది. ఈ సందర్భంగా నారా లోకేష్ స్పందించారు. ఒక పోస్ట్ ని షేర్ చేశారు.

Advertisement

Advertisement

ప్రజా రాజధాని కోసం 1500 రోజులు గా పోరాడుతున్న రైతులకి ఉద్యమ అభివందనాలు ప్రాణాన్ని కోల్పోయిన వారికి నా నివాళులు. వారి ఆశయంతో త్వరలోనే నెరవేరుతుందని నారా లోకేష్ అన్నారు. రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. అధర్మం పై ధర్మం విజయం సాధిస్తుందని నారా లోకేష్ పోస్ట్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను రైతులు భూ సమీకరణ కింద గత ఏడది ప్రభుత్వానికి ఇచ్చారని నారా లోకేష్ అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading