టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప ది రైజ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో మంచి ప్రభావాన్నే సృష్టించిందనే చెప్పవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ తరువాత వెస్టిండిస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కూడా ఈ చిత్రంలో డ్యాన్స్ మూవ్‌వెంట్‌ను చూపించాడు. ముఖ్యంగా శ్రీవల్లి పాటలో అల్లుఅర్జున్ డ్యాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. భారత క్రికెటర్లు సురేష్ రైనా, ఖలీల్ అహ్మద్ ఈ పాటలో తమ డ్యాన్స్ మూవ్‌మెంట్ పంచుకున్నారు. దీనిని ఇప్పుడు పుష్ప వాక్ అని కూడా పిలుస్తున్నారు.
Advertisement
Advertisement
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌తో జరిగిన పోరులో బ్రావో క్రికెట్ మైదానంలో ప్రసిద్ధ పుష్ప కదలికను ప్రదర్శించాడు. ముఖ్యంగా ఆటలో మూడు వికెట్లను తీశాడు. అతని జట్టు ఫార్చ్యూన్ బోరిషాల్‌నుకొమిల్లా విక్టోరియాను 20 ఓవర్లలో 158 /7 వద్ద పరిమితం చేశాడు. బంతితో ఆల్‌రౌండర్ అద్భుతంగా ఆడినప్పటికీ ఫార్చూన్ బరిశాల్ 63 పరుగుల తేడాతో గేమ్‌ను కోల్పోయింది. 20 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ కావడంతో ఛేదనలో బరిశాల్ బ్యాటింగ్ కుప్పకూలింది.
గోయింగ్ విత్ ది ట్రెండ్. @davidwarner31 @sureshraina3 నేను ఎలా చేశాను..? అనే క్యాప్షన్‌తో ఆల్ రౌండర్ బ్రావో డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌పై సురేష్ రైనా, డేవిడ్ వార్నర్ ఇద్దరూ స్పందించారు. “@djbravo47 వెల్ డన్ బ్రేవో” అని సురేష్ రైనా కామెంట్ సెక్షన్‌లో రాశారు.”హా లెజెండ్, యు ఆర్ ది మ్యాన్ బ్రదర్” అని వార్నర్ వ్యాఖ్యానించాడు. అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ టోర్నమెంట్‌లో చివరి నాలుగుకు చేరుకోవడంలో విఫలమైన టీ-20 ప్రపంచ కప్ తరువాత బ్రావో నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.