Home » చిరంజీవి ఆంజనేయ స్వామికి భక్తుడిగా ఎలా మారాడో తెలుసా ?

చిరంజీవి ఆంజనేయ స్వామికి భక్తుడిగా ఎలా మారాడో తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయస్వామిని ఎంతగానో విశ్వసిస్తారో దాదాపు అందరికీ తెలిసిందే.   తనకు సంబంధించిన ఏదైనా ఒక శుభవార్తను అభిమానులతో పంచుకోవాలని ముందుగా ఆంజనేయస్వామి ఆశీస్సులతో అంటూనే ఆ వార్తను అభిమానులకు తెలియజేస్తారు. అదేవిధంగా కొణిదెల ప్రొడక్షన్ లోగోని కూడా ఆంజనేయస్వామి ఉన్నట్టు రూపొందించారు. ఇలా చిరంజీవి ఆంజనేయస్వామికి పరమ భక్తుడు అనే సంగతి మనకు తెలిసిందే.  ఆంజనేయస్వామిని చిరంజీవి ఇంతలా ఆరాధించడానికి కారణం ఏంటి..?  అసలు ఈయన ఆంజనేయస్వామి భక్తులు ఎలా అయ్యారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన  హను-మాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 07న జరిగిన విషయం తెలిసిందే.  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  ముఖ్యంగా  చిన్నప్పటినుంచి మా ఇంట్లో ఎవరికీ కూడా పెద్దగా భక్తి అనేది లేదు. మా నాన్న ఎప్పుడో ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకి తీసుకెళ్లేవారు. ఇక నేను చిన్నప్పుడు వివిధ ప్రాంతాలలో చదువుకున్నాను. అక్కడ  ఆంజనేయస్వామి ఆలయం ఉండడంతో నేను ప్రతిరోజు మొక్కుకునేవాడిని. ఇక తాను ఆంజనేయస్వామి గుడి దగ్గరకు వెళ్లి ప్రసాదం పెడితే ఆ ప్రసాదం తీసుకునేవాడిని. అక్కడ ఆంజనేయస్వామి మహత్వం గురించి పూజారి చెప్పిన మాటలను విని, నాకు తెలియకుండానే నేను కూడా ఆంజనేయ స్వామికి భక్తుడిగా మారిపోయానని.. ఆ పూజారి మాటలతో హనుమాన్ చాలీసా చదవడం కూడా మొదలు పెట్టానని తెలిపారు.

Advertisement

Chiranjeevi-in-hanuman-pre-release-event

Chiranjeevi-in-hanuman-pre-release-event

ఇలా నేను ఎక్కడికి వెళ్లినా ఆంజనేయస్వామిని నమస్కరిస్తూ నాపనులను ప్రారంభించేవాడిని. ఆ పనులన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అయ్యాయి. ఇక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి రావాలి అనుకున్నటువంటి తనకు ఒకరోజు మా పెరట్లో ఆంజనేయస్వామి లాకెట్ కనిపించిందని.. దానిని మెడలో వేసుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి వచ్చానని ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నాకు ఈ స్థాయిలో సక్సెస్ వచ్చింది అంటే నాకు తోడుగా హనుమాన్ ఉండడంతోనే ఇలా ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఇప్పటికీ కూడా నాకు ఏదైనా సమస్య వస్తే రాత్రి నా సమస్యను ఆంజనేయస్వామికి చెప్పుకుంటాను. ఉదయానికి నాకు పరిష్కారం దొరుకుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆంజనేయుడు నా వెంట పడ్డారా, లేక నేను ఆంజనేయుడి వెంటపడ్డానా అన్న సందేహం కూడా కలుగుతుందని తెలిపారు. మనం ఆయనని నమ్ముకుంటే ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తారు అంటూ ఈ సందర్భంగా ఆంజనేయస్వామి గురించి స్వామివారికి భక్తుడిగా మారడం గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading